వెంకటేశ్వరరావుకు స్వాగతం చెబుతున్న దృశ్యం
కడప(సెవెన్ రోడ్స్), మే 18 : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన 1986లో ఎంబీబీఎస్, 1992లో ఎండీ విద్య పూర్తిచేశారు. అనంతపురం, తిరుపతి, గుంటూరులలో పనిచేశారు. నెల్లూరు జీజీహెచ్‌లో జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీగా పనిచేస్తూ... కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్) సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. బుధవారం బాద్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి అన్ని విభాగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రోగులు ఇబ్బందులకు గురవుతకుండా వైద్యం అందిస్తామని తెలిపారు. కొత్త సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, ఆర్‌ఎంవో రాజేశ్వరి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.