తణుకులో.. డ్రాగన్‌ ఫ్రూట్‌

ABN , First Publish Date - 2021-09-17T04:55:20+05:30 IST

బ్రహ్మజెముడు జాతికి చెందిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ఖండాంతరాలు దాటి మనముందుకు వచ్చింది.

తణుకులో.. డ్రాగన్‌ ఫ్రూట్‌

అబ్బుర పరుస్తున్న పంట

తణుకు, సెప్టెంబరు 16: బ్రహ్మజెముడు జాతికి చెందిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ఖండాంతరాలు దాటి మనముందుకు వచ్చింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ అమెరికా, చైనా దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. సామాన్య ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండని ఫ్రూట్‌గా చెబుతుంటారు. ఎందుకంటే ఇతర దేశాలు నుంచి ఇక్కడ వచ్చినది కాబట్టి ధర ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్రూట్‌ను తణుకు సమీప ంలోని పైడిపర్రులో చీర్ల రాధయ్య వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మంగా తనకు ఉన్న అర ఎకరంలో పంటను సాగుచేసి విజయం సాధించారు. ప్రస్తుతం మొదటి పంటను తీశారు.

ప్రేరణ: ప్రత్తిపాడుకు చెందిన రాధయ్య సోదరుడు బ్రహ్మారావు ఇంటికి నాలు గు సంవత్సరాల క్రితం రెండు కుండీల్లో మొక్కలను తీసుకు వచ్చారు. వాటిని పైడిపర్రులోని తన కార్యాలయ ఆవరణలో వేయగా మంచి ఫలితం వచ్చింది. దీంతో కోల్‌కత్తా, గుంటూరుల నుంచి ఒక్కొక్కటికి 80 రూపాయలు వెచ్చించి మొక్కలను కొనుగోలు చేసి తన అర ఎకరం పొలంలో సాగు ప్రారంభించారు.

ఎకరాకు ఐదు లక్షలు పెట్టుబడి

 పంట మొదటిసారి వేసినపుడు మాత్రం ఎకరాకు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ప్రధానంగా పొలం చుట్టూ ఇనుప ఫెన్సింగ్‌, సిమెంటు పోల్స్‌, మొక్కలకు ఖర్చు అవుతుంది. రెండవ సంవత్సరం నుంచి ఏమి ఖర్చు ఉండదు. సుమారు ఇరవై సంవత్సరాల వరకు వినియోగించ్చుకోవచ్చు.

మొక్కల్లో మూడు రకాలు

 మొక్కల్లో మూడు రకాలు ఉంటాయి. వాటిలో తెలుపు, ఎరుపు, పింక్‌ రంగులు ఉంటాయి. ఫ్రూట్‌లో చిన్నవి, పెద్దవి కూడా వచ్చే మొక్కలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పింక్‌ రంగు ఫ్రూట్‌ మొక్కలు ఉన్నాయి. పంట జూలై నెల నుంచి అక్టోబరు చివర వరకు వస్తాయి. సంవత్సరానికి టన్ను పండ్లు వచ్చినట్లయితే లక్షా యాభైౖవేలు ఆదాయం వస్తుంది. ప్రస్తుతానికి స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

తెగుళ్ళ బెడద:  పంటకు నీటి వినియోగం చాలా తక్కువ. మొక్కలకు తెగుళ్ళు బెడద ఉంటుంది. ప్రధానంగా లద్దిపురుగు, పచ్చపురుగు, జలగ వస్తుంటాయి. వాటిని సకాల ంలో గుర్తించినట్లయితే ఎలాంటి నష్టం వాటిల్లదు.




Updated Date - 2021-09-17T04:55:20+05:30 IST