టమోటాలు పారబోత

ABN , First Publish Date - 2022-08-09T04:59:22+05:30 IST

మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విడవకుండా ముసురు వర్షం కురుస్తుండటం, టమోటా నాణ్యత తగ్గుతుండటం వెరసి రెండు వారాలుగా టమోటా ధరలు ఆశాజనకంగా లేవు. మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 700 టన్నుల టమోటాలు విక్రయానికి వస్తుండగా, చట్టుపక్కల గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, ములకలచెరువు మార్కెట్లలో కూడా టమోటాలు విపరీతంగా విక్రయానికొస్తున్నాయి.

టమోటాలు పారబోత
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామం వద్ద పారబోసిన టమోటాలు

ధరలు నేలముఖం   

ఆవేదనలో అన్నదాతలు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 8: మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విడవకుండా ముసురు వర్షం కురుస్తుండటం, టమోటా నాణ్యత తగ్గుతుండటం వెరసి రెండు వారాలుగా టమోటా ధరలు ఆశాజనకంగా లేవు. మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 700 టన్నుల టమోటాలు విక్రయానికి వస్తుండగా, చట్టుపక్కల గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, ములకలచెరువు మార్కెట్లలో కూడా టమోటాలు విపరీతంగా విక్రయానికొస్తున్నాయి. దీంతో పాటు చెన్నై, విజయవాడ, నెల్లూరు, విశాఖ మార్కెట్లతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా టమోటాకు డిమాండ్‌ తగ్గడంతో ధరలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు టమోటా తోటల్లో కోతల నుంచి రవాణా చార్జీలు కూడా దక్కడం లేదు. మదనపల్లె మార్కెట్‌లో నాణ్యమైన టమోటా గరిష్టంగా కిలో. రూ.10 పలుకుతుండగా, నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో రూ.5కు విక్రయిస్తుండగా ఎక్కువగా కిలో కేవలం రూ.3 మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో తోటల్లో విపరీతంగా దిగుబడి వస్తున్న టమోటాలను టమోటా మొక్కలపైనే వదిలేయలేక, కోత కోస్తున్న రైతులు వాటిని ట్రాక్టర్లతో తీసుకొచ్చి పొలం పక్కన పారబోస్తున్నారు. సోమవారం మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామం వద్ద రైతులు కోసిన టమోటాలను ఇలా ట్రాక్టర్లతో తీసుకొచ్చి పొలం పక్కన పారబోసారు.

Updated Date - 2022-08-09T04:59:22+05:30 IST