మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే కొల్లాపూర్‌లో డ్రామాలు

ABN , First Publish Date - 2022-06-28T04:48:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ చర్చ సినిమాను రక్తికట్టించారని బీజేపీ జిల్లా అధ్యక్షు డు ఎల్లేని సుధాకర్‌రావు ఎద్దేవా చేశారు.

మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే కొల్లాపూర్‌లో డ్రామాలు
కొల్లాపూర్‌ ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో విలేకర్లతో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు

- ఎమ్మెల్యే బీరం, మాజీ మంత్రి జూపల్లి అవినీతిపై విచారణ చేసి టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి

- మంత్రి కేటీఆర్‌కు ఎల్లేని బహిరంగ లేఖ

- వచ్చే నెల 10వ తేదీన బండాయిగుట్ట వద్ద బహిరంగ చర్చలో నిజాలు వెల్లడించాలి

- మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరంలకు ఎల్లేని సవాల్‌

కొల్లాపూర్‌, జూన్‌ 27 : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ చర్చ సినిమాను రక్తికట్టించారని బీజేపీ జిల్లా అధ్యక్షు డు ఎల్లేని సుధాకర్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం కొల్లాపూర్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లేని మాట్లాడారు. అధికార పార్టీలోనే ఉన్నామంటూ మాజీ మంత్రి జూప ల్లి కృష్ణారావు ఒక వైపు ప్రకటిస్తూనే మరో వైపు అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో సవాళ్లు ప్రతి సవా ళ్లు చేసుకుంటున్నారని బహిరంగ చర్చల పేరుతో డ్రా మా సృష్టించి కొల్లాపూర్‌ ని యోజకవర్గ ప్రజలను వారం రోజులు మభ్యపెట్టారని ఎల్లేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా వు అవినీతిపై విచారణ చేసి అవినీతికి పాల్పడ్డ వారిని టీ ఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కొల్లాపూర్‌ ఎన్‌టీ ఆర్‌ చౌరస్తా వేదికగా కేటీఆర్‌ కు ఎల్లేని సుధాకర్‌రావు బహి రంగ లేఖ రాశారు. వచ్చే నెల 10వ తేదీన కొల్లాపూర్‌ పట్టణంలోని బండాయిగుట్ట దే వాలయం వద్ద ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరిపై ఒక రు చేసుకున్న ఆరోపణలను బహిరంగ చర్చలో ప్రజల సమక్షంలో వెల్లడించాలని ఆయన సవాల్‌ విసిరారు. అదేవిధంగా బహిరంగ చర్చకు అనుమతి లేదని 144 సెక్షన్‌ అమల్లో ఉందని పోలీసులు ప్రకటించిన తర్వాత టీఆర్‌ఎస్‌ నాయకులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వ హించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇందులో పోలీసుల పాత్ర ఉందని ఎల్లేని ఆరోపించా రు. పోలీసుల పాత్రపై విచారణ జరిపి ప్రోత్సహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వ ర్యంలో జిల్లా ఎస్పీ మనోహర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆ యన వెల్లడించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ సమస్య లపై బీజేపీ ఆధ్వర్యంలో పోరాడుతామని, ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటామని ఎల్లేని పేర్కొన్నారు. సమావే శంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తమటం శేఖర్‌గౌడ్‌, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ మేకల శ్రీనివాస్‌యాదవ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు, బీజేపీ మండల అధ్యక్షుడు తమటం సాయికృష్ణగౌడ్‌, కొల్లాపూర్‌ నగర అధ్యక్షుడు కాకి సత్యనారాయణగౌడ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌చంద్ర,  బీజేపీ అధ్యక్షులు, మహిళా నాయకురాలు రోజారమణి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:48:13+05:30 IST