డీఆర్‌డీఏ డీపీఎం ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-06T06:41:59+05:30 IST

డీఆర్‌డీఏ లైవ్‌స్టాక్‌ విభాగం అనంతపురం డిస్ర్టిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (డీపీఎం) డాక్టర్‌ రాము (50) ఆత్మహత్య చేసుకున్నారు.

డీఆర్‌డీఏ డీపీఎం ఆత్మహత్య
రాము (ఫైల్‌)

- గెస్ట్‌హౌస్‌లో ఉరివేసుకున్న డాక్టర్‌ రాము

 - తలుపులు తెరిచి ఉండటంపై అనుమానాలు

- మోసం చేసిన వారే కారణమని సూసైడ్‌ నోట్‌


అనంతపురం  క్రైం, జూలై 5: డీఆర్‌డీఏ లైవ్‌స్టాక్‌ విభాగం అనంతపురం డిస్ర్టిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (డీపీఎం) డాక్టర్‌ రాము (50) ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం నగరంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న అతిథిగృహంలో ఆయన ఉరివేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన మాతృశాఖ పశుసంవర్థక శాఖ. ఆ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రామును ఈ ఏడాది జనవరిలో డీఆర్‌డీఏ డీపీఎంగా నియమించారు. ఆయన భార్య కర్నూలు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం దూరంగా ఉండటంతో రాము తరచూ డీఆర్‌డీఏ అతిథిగృహం, లేదా పశుసంవర్థక శాఖ కార్యాలయ అతిథిగృహంలోనే బస చేసేవారు. పశుసంవర్థక శాఖ సిబ్బంది మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అతిథి గృహం పైన ఉన్న ట్యాంకు నుంచి నీరు వస్తోందో లేదో చూడటానికి వెళ్లారు. అక్కడున్న గది బార్లా తెరిచి ఉండటం, రాము ఉరికి వేలాడుతుండటాన్ని చూసి ఆందోళన చెందారు. వెంటనే విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారు వనటౌన పోలీసులకు సమాచారం అందించారు. 


మోసం చేశారని సూసైడ్‌ నోట్‌ 


   తన చావుకు పలువురు కారణమని డాక్టర్‌ రాము సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన అటెండర్‌ జాకీర్‌, కోట్ల అనిల్‌, కోట్ల విజయ, ఆమె ప్రియుడు మహేష్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, రూ.50 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌లో రాశారు. నెట్‌ సెర్ఫ్‌ బిజినె్‌సలో చిక్‌బళ్లాపూర్‌ మునిరాం, జియోన మెడికల్‌ షాప్‌ పుట్టపర్తి అశోక్‌కుమార్‌, అశ్వర్థనారాయణ, కల్లూరు హరికృష్ణ పేర్లను ప్రస్థావించి, అందరూ మోసగించారని రాశారు. నందల సెనమె్‌స బామ్‌లే సంస్థలో పనిచేస్తున్న డీసీ హుసేన, పుట్టపర్తి అశోక్‌ కుమార్‌కు గోపాలమిత్ర దగ్గర రూ.4 లక్షలకు తన పేరిట ప్రామిసరీ నోటు రాసిచ్చానని పేర్కొన్నారు. మందుల డబ్బులో  మోసం చేశారు అని అందులో రాశారు. ఈ ఒత్తిళ్లు కూడా ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్‌ రాముకు  భార్య రాణి, 12 ఏళ్ల కూతురు రిత్విక ఉన్నారు. 


బలహీనతలలే కారణమా..? 


గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన డాక్టర్‌ రాము ఆత్మహత్యకు ఆయన బలహీనతలే కారణమని సమాచారం. తనను కొందరు మోసం చేశారని, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సూసైడ్‌నోట్‌లో రాయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన అటెండర్‌ జాకీర్‌, కోట్ల విజయ, ఆమె లవర్‌ మహేష్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారని నోట్‌లో పేర్కొన్నారు. వెటర్నరీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి వ్యక్తి ఒకరు డాక్టర్‌ రాము బలహీనతను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. 


వారెవరో తెలియదట..


   డీఆర్‌డీఏ డీపీఎం మృతి విషయం తెలుసుకున్న ఆయన భార్య రాణి, సోదరుడు అనంతపురానికి వచ్చారు. సీఐ రవిశంకర్‌రెడ్డి వారితో మాట్లాడారు. సూసైడ్‌నోట్‌లో రాసిన వ్యక్తుల గురించి తమకేమీ తెలియదని వారు చెప్పినట్లు సీఐ తెలిపారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగానే కేసు నమోదు చేయాలని వారు కోరినట్లు తెలిసింది. 









Updated Date - 2022-07-06T06:41:59+05:30 IST