అస్మి గన్ పైభాగంలో ఉండే రిసీవర్‌ను విమానాల తయారీలో వాడే అల్యూమినియంతో రూపొందించారు. కింది భాగంలో ఉండే రిసీవర్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఆర్మీ అధికారుల వ్యక్తిగత ఆయుధాల కేటగిరీలో అస్మి కీలకపాత్ర పోషిస్తుందనేది నిపుణులు అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలకు, వీఐపీ రక్షణ విధులు నిర్వర్తించే వారికి కూడా ఈ ఆయుధం ఉపయోగపడుతుందని కేంద్ర రక్షణ శాఖ చెబుతోంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గన్ ఒక్కొక్కటీ తయారు చేసేందుకు రూ.50 వేలకంటే ఎక్కువ ఖర్చు కాదని అంచనా వేస్తోంది.