ఐఐటీహెచ్‌లో డీఆర్డీవో పరిశోధనా కేంద్రం

ABN , First Publish Date - 2020-07-07T07:06:53+05:30 IST

దేశ రక్షణరంగ సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఐఐటీ హైదరాబాద్‌, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) జట్టుకట్టాయి. దీనిపై ఈనెల 3న జరిగిన సమావేశంలో రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది

ఐఐటీహెచ్‌లో డీఆర్డీవో పరిశోధనా కేంద్రం

కంది, జూలై 6: దేశ రక్షణరంగ సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఐఐటీ హైదరాబాద్‌, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) జట్టుకట్టాయి. దీనిపై ఈనెల 3న జరిగిన సమావేశంలో రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. ఈసందర్భంగా డీఆర్డీవో ఎంఎస్‌ఎ్‌స (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎంఎ్‌సఆర్‌ ప్రసాద్‌, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బి.ఎ్‌స.మూర్తి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. డీఆర్‌డీఓకు ఇప్పటికే చెన్నైలో ఒక రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌(ఆర్‌ఐసీ) ఉంది. ఇదే తరహాలో త్వరలో మరో ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని ఐఐటీహెచ్‌లో నెలకొల్పనున్నారు. ఒప్పందం కుదిరిన సందర్భంగా రక్షణ రంగం పరిశోధన,అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్‌ జి.సతీ్‌షరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ ఒప్పందం ద్వారా దేశంలోని రక్షణ రంగానికి శాస్త్ర, సాంకేతిక స్వావలంబన చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీహెచ్‌-డీఆర్డీవో పరిశోధనా కేంద్రం వేర్వేరు రక్షణ ప్రాజెక్టుల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-07-07T07:06:53+05:30 IST