పాట పాతదే.. కానీ ట్రెండ్‌లో ఉంది!

May 23 2021 @ 20:07PM


‘పాటొచ్చి పదేళ్లు అయింది.. అయినా క్రేజ్‌ తగ్గలేదు’ గబ్బర్‌సింగ్‌లో అలీ చెప్పిన డైలాగ్‌ ఇది. ప్రస్తుతం ఓ పాట విషయంలో ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. జనరల్‌గా ఓ పాట హిట్టైంది అంటే ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఆ పాటపైనే రీల్స్‌, కవర్స్‌, మాషప్స్‌ తయారవుతున్నాయి. డాన్స్‌ మీదున్న ఆసక్తితో చాలా సింపుల్‌ స్టెప్పులతో పాటను రీ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌. ఈ మధ్య కాలంలో నెటిజన్లను అంతగా ఆకట్టుకున్న పాట హిందీ చిత్రం ‘ఐయ్యా’లోని ‘డ్రీమమ్‌ వేకపప్‌’. రాణీముఖర్జీ, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌పై  తెరకెక్కించిన పాట ఇది. 2012లో విడుదలైన ‘ఐయ్యా’ చిత్రంలోని ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆ పాటకు సినీ తారలు సురేశావాణి, తన కూతురు సుప్రీత, ప్రగతి,  యూట్యూబ్‌ స్టార్స్‌ భాను, అపూర్వరావ్‌, మెహబూబ్‌, ఆటా సందీప్‌, శ్వేతా నాయుడు తదితరులు ఈ పాటతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. 











Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.