ముంచిన వాన

ABN , First Publish Date - 2022-10-07T04:53:11+05:30 IST

బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడ తెరిపి లేని వర్షం కురుస్తున్నది.

ముంచిన వాన
చిన్నచింతకుంట : చిన్న వడ్డెమాన్‌ గ్రామ సమీపంలో వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

- జిల్లా అంతటా భారీ వర్షం

- పొంగిపొర్లిన చెరువులు, వాగులు, వంకలు

- నీట మునిగిన పంటపొలాలు- రైతులకు అపార నష్టం


మహబూబ్‌నగర్‌ టౌన్‌/ చిన్నచింతకుంట/ జడ్చర్ల/ గండీడ్‌/ మహ మ్మదాబాద్‌/ మూసాపేట/ అడ్డాకుల/ భూత్పూర్‌, అక్టోబరు 6 : బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడ తెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం మ ధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్‌ పట్టణంలో లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గణేష్‌నగర్‌, బీకేరెడ్డి కాలనీ, శివశక్తి నగర్‌ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు వచ్చింది. అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే ఆల

భారీ వర్షాలు కురుస్తున్నందున నియోజకవర్గానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడా రు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని, ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నదని, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడైనా వర్షాల కారణంగా ఇల్లు కూలిపోతే ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించి ప్రభుత్వపరంగా బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. 

నిలిచిన రాకపోకలు 

గురువారం తెల్లవారు జామున నుంచి భారీ వర ్షం కురుస్తుండడంతో చిన్నచింతకుంట మండలంలో వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లు తున్నాయి. మండలంలోని మన్యవాగు ఉధృతంగా పారుతుండడంతో సీతారంపేట, చిన్న వడ్డెమాన్‌ గ్రామాల సమీపంలోని వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. చిన్న వడ్డెమాన్‌ వంతెనపై నీరు ప్రవేశించడంతో ఆత్మకూర్‌-హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలో 1.5 సెంటిమీటర్ల వర్షం కురి సిందని అధికారులు తెలిపారు. పత్తి, వరి పంట లకు కొంతవరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మండలంలోని చిన్న వడ్డెమాన్‌ గ్రామ సమీ పంలో గల శ్రీరామలింగేశ్వర ఆలయం సమీపం లో బోయ కురుమూర్తి అనే రైతు వ్యవసాయ పొలంలో బోరు నుండి నీరు ఉబికి వస్తున్నది.

చిట్టెబోయిన్‌పల్లిలో రెండు గేదెలు మృతి 

జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. పట్టణం లో మురుగుకాలువలు నిండుకున్నాయి. సిగ్నల్‌ గడ్డకు వెళ్లే దారిలోని ప్రధాన రహదారిపైకి నీళ్లు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. ముందస్తు చర్యలను కమిషనర్‌ మహమూద్‌షేక్‌ చేప ట్టారు. చైతన్యనగర్‌ కాలనీ సమీపంలోని అండర్‌ పాస్‌, నల్లకుంటమీదుగా వర్షం నీరు వచ్చే మురుగుకాలువలతో పాటు సిగ్నల్‌గడ్డ వైపు వెళ్లే దారిలోని మురుగుకాలువలలో నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టారు. 

చిట్టబోయిన్‌పల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున పిడుగు పాడి ముడావత్‌ కృష్ణకు చెందిన రెండు పాడిగేదెలు  మృతిచెందాయి. 

వర్షాలకు గండీడ్‌ మండలం వెన్నాచేడ్‌ పెద్ద చెరువు, సాలర్‌నగర్‌ ప్రా జెక్ట్‌, గండీడ్‌, పెద్దవార్వల్‌ చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో రూపేం దర్‌రెడ్డి తెలిపారు. వేరుశనగ పైర్లలో నీరు నిలిచిపోయాయి. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరారు. 

చెరువులను తలిపించిన పంటపొలాలు 

మహమ్మదాబాద్‌ మండలం వాప్తంగా కురిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 61.0 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా మండలంలోని చాలా గ్రామాల్లో వేరు శనగా పంట నీట మునిగింది. పల్లి మొలకెత్తే అవకాశం లేదు.

ప్రమాదపుటంచులో చౌట చెరువు 

మూసాపేట మండలంలోని పెద్ద వాగుతో పాటు వంపులు, వాగులు నిండిపారుతున్నాయి. మూసాపేట చౌట చెరువుకు పూర్తి స్థాయిలో నీరు చేరుకొని కట్ట పై భాగానికి కేవలం రెండు అడుగులు మిగలడంతో కట్టకు ప్రమాదం పొంచి ఉంది. మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి శేఖర్‌, ఎంపీపీ భర్త కొండయ్య గ్రామస్థులతో కలిసి చెరువు కట్టను పరిశీలించి చెరువుకు న్న షట్టర్లను జేసీబీతో తొలగిస్తే కట్ట తెగకుండా ఉంటుందని అధికారులకు సూచించారు. పెద్దవాగు ప్రవహిస్తుండడంతో తహసీల్దార్‌ మంజుల, ఎస్‌ఐ నరేష్‌లు పోల్కంపల్లి రోడ్డును పరిశీలించారు.

గౌరిదేవిపల్లి కాజ్‌వే పరిశీలన

అడ్డాకుల మండలం కందూరు అనుబంధ గ్రామం గౌరిదేవిపల్లిలో వాగులో గల చెక్‌డ్యాంను, కాజ్‌వేను తహసీల్దార్‌ కిషన్‌ స్థానిక సర్పంచు శ్రీకాంత్‌తో కలిసి గురువారం పరిశీలించారు. వర్షాలకు నీరు పారుతు న్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని స్థాని కులకు తహసీల్దార్‌ సూచించారు. డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు, రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

నిండిన చెరువులు, కుంటలు

వర్షాలకు భూత్పూర్‌ మండలంలో మొగుళ చెరువు, కతల్‌ఖాన్‌, భూత్పూర్‌ ఊరకుంట, తాటికొండ ఈరన్న చెరువు, శేరిపల్లి అనంతమ్మ చెరువు, అమిస్తాపూర్‌ పెద్దచెరువు వంటివి అలుగు పారుతున్నాయి. జిల్లా మత్స్య సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ గురువారం ఆయకట్టు రైతులతో కలిసి అలుగు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. 





Updated Date - 2022-10-07T04:53:11+05:30 IST