సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌

ABN , First Publish Date - 2022-01-22T06:23:44+05:30 IST

గ్రామ,వార్డు సచివా లయాల ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికీ నాలుగు జతల ఏకరూపు దుస్తులను ప్రభుత్వం సరఫరా చేసింది

సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌

అమలాపురం రూరల్‌, జనవరి 21: గ్రామ,వార్డు సచివా లయాల ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికీ నాలుగు జతల ఏకరూపు దుస్తులను ప్రభుత్వం సరఫరా చేసింది. మహిళా, పురుష ఉద్యోగులకు వేరువేరుగా ప్యాకింగ్‌లు చేసి ఏకరూపు దుస్తులను సరఫరా చేశారు. పురుష ఉద్యోగులకు బిస్కెట్‌ కలర్‌ ప్యాంటు, లేత నీలిరంగు షర్టు. మహిళా ఉద్యోగులకు బిస్కెట్‌ కలర్‌ ప్యాంటు, లేతనీలిరంగు టాప్‌లతో పాటు బిస్కెట్‌ కలర్‌ చున్నీలతో కూడిన మెటీరియల్‌ను అందజేస్తున్నారు.  మండల పరిషత్‌ కార్యాలయాలకు చేరుకున్న ఏకరూపు దుస్తులను సచివాలయ ఉద్యోగులకు అందించేందుకు ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మిలు చర్యలు చేపట్టారు. 



Updated Date - 2022-01-22T06:23:44+05:30 IST