అధిక బరువు తగ్గాలంటే..!

ABN , First Publish Date - 2022-08-30T17:36:14+05:30 IST

ఆహారంతోనే కాదు, నీళ్లతో కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగంటే...

అధిక బరువు తగ్గాలంటే..!

హారంతోనే కాదు, నీళ్లతో కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగంటే...


ఉదయం:  ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల అంతర్గత అవయవాలు ఉత్తేజితమవుతాయు.

వర్కవుట్‌: వ్యాయామం ముగించిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండె కొట్టుకునే వేగం నార్మల్‌గా మారుతుంది.

స్నానానికి ముందు: రక్తపోటు తగ్గుతుంది.

భోజనానికి ముందు: భోజనానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగడం వల్ల అతిగా తినే సమస్య తప్పుతుంది.

అలసట: అలసటకు గురైనప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఓపిక పుంజుకుంటాం.

భోజనం తర్వాత: భోజనం చేసిన గంట తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.

నిద్రకు ముందు: కమ్మని నిద్ర పడుతుంది.


ఇలా వారంలో ఏడు రోజుల పాటు వాటర్‌ థెరపీని అనుసరిస్తే, కచ్చితంగా బరువు తగ్గడం మొదలుపెడతాం!

Updated Date - 2022-08-30T17:36:14+05:30 IST