తాగునీరు వృథా!

ABN , First Publish Date - 2021-04-24T05:20:53+05:30 IST

వేసవిలో ప్రజలకు అత్యంత అవసరమైన తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువు అయ్యారు.

తాగునీరు వృథా!
గ్రోత్‌ సెంటర్‌ వద్ద వృథాగా పోతున్న గుండ్లకమ్మ తాగునీరు

పది రోజులుగా ఇదేతీరు

తరచూ పైప్‌లైన్‌ మరమ్మతులు

40 గ్రామాల ప్రజల ఇక్కట్లు

మేదరమెట్ల,  ఏప్రిల్‌ 23: వేసవిలో ప్రజలకు అత్యంత అవసరమైన తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువు అయ్యారు. నీరులేక చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఉన్న నీటిని సక్రమంగా అధికారులు పంపిణీ చేయలేక పోతున్నారు. వేసవిలో పైపులైన్లు మరమ్మతులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాలలోకి వెళ్తే.. 

గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేస్తున్నారు. ఆ నీటిని గుండ్లాపల్లి వద్ద ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నుంచి మేదరమెట్లలోని  ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు పంపిణీ చేస్తున్నారు. గుండ్లాపల్లి నుంచి మేదరమెట్ల వరకు గతంలో నిర్మించిన పైపులైన్‌ తరచూ మరమ్మతులకు గురవుతోంది.  అధునిక టెక్నాలజీ పేరుతో నిర్మించిన ఈ పైపులైను మరమ్మతులుు చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతోంది.  పది రోజులుగా గ్రోత్‌ సెంటర్‌ ప్రధాన ద్వారం ముందు పైపులైన్‌ లీక్‌ అయి నీరు వృథాగా పో తున్నది. పంపింగ్‌ ఆపినప్పుడు రోడ్డుమీద ఉ న్న మురుగునీరు కూడా పైపులైన్‌లోకి పో తోంది. దీంతో శుభ్రపరిచిన నీటిలోకి మురుగునీరు కలుస్తోంది. ఈ నీరు 16వ నెంబర్‌ జాతీ య రహదారి మార్జిన్‌ నుంచి దగ్గరలోని వాగులోకి వెళ్తోంది. గుండ్లాపల్లి నుంచి మేదరమెట్లకు పంపిణీ చేసే సమయంలో నీరు ఎక్కువ గా లీక్‌ అయి వృథాగా అవుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు వేలాది మంది తిరిగే గ్రోత్‌ సెంటర్‌ ప్రధాన ద్వా రం వద్ద నీరు లీక్‌ అవుతున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. 

నాగులుప్పలపాడు మండలంలోని 4 గ్రామాలు, కొరిశపాడు మండలంలోని 15 గ్రామాలు, అద్దంకి, జె.పంగులూరు మండలాల్లోని సుమారు 20 గ్రామాల కు ఈ పైపులైన్‌ ద్వారానే తాగునీరు సరఫరా అవుతోంది. ఈ వేసవిలో నాలుగు రోజుల పాటు తాగునీరు అందకపోతే ప్రజలతో పాటు పశువులు  ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు స్పందించి లీకులకు మ రమ్మతులు చేసి తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-04-24T05:20:53+05:30 IST