మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు

ABN , First Publish Date - 2021-06-20T05:25:31+05:30 IST

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు
కడ్తాల్‌ : వాటర్‌ ట్యాంక్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌


కడ్తాల్‌: దేశంలో ఇంటింటికీ శుద్ధ తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కడ్తాల మండలం రావిచెడ్‌, న్యామతాపూర్‌, మక్తమాదారం, రేఖ్య తండా, నాగిరెడ్డిగూడ తండా,  సాలార్‌పూర్‌, చల్లంపల్లి, వంపుగూడ గ్రామాల్లో మిషన్‌భగీరథ ద్వారా రూ.5 కోట్లతో నిర్మించిన వాటర్‌ ట్యాంకులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మక్తమాదారంలో అంతర్గత మురుగు కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ జోగు వీరయ్య, సర్పంచ్‌లు భారతమ్మవిఠలయ్యగౌడ్‌, రవీందర్‌రెడ్డి, సులోచన సాయిలు, హరిచంద్‌ నాయక్‌, విజయలక్ష్మి, కృష్ణయ్యయాదవ్‌, ఎంపీటీసీలు గోపాల్‌, మంజుల చంద్రమౌళి, లచ్చీరాం నాయక్‌, ఎంపీడీఓ రామకృష్ణ, మిషన్‌ భగీరథ డీఈ జగన్మోహన్‌రెడ్డి, ఏఈలు వాగ్దేవి, సృజన, ఎస్‌ఐ సుందరయ్య, నాయకులు పాల్గొన్నారు. కడ్తాల మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన దేవికి రూ.48వేలు, మర్రిపల్లికి చెందిన దేవకమ్మకు రూ.56 వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. శనివారం గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చెక్కులను అందజేశారు. 

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం : ఎమ్మెల్సీ కసిరెడ్డి

ఆమనగల్లు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా రూ.1.25 లక్షలు మంజూరయ్యాయి. శనివారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్‌, అనితవిజయ్‌, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆరోగ్య రక్షణకు పెద్దపీట : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

కొత్తూర్‌: నిరుపేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన కమ్మరి సత్యనారాయణకు రూ.38వేలు, దేశాల జగన్‌కు రూ.16వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరు కాగా, ఎమ్మెల్యే స్వగ్రామమైన ఎక్లా్‌సఖాన్‌పేట్‌లో శనివారం ఎల్‌వోసీలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎమ్మె సత్యనారాయణ, పెంటనోళ్ల యాదగిరి, దేశాల భీమయ్య, రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-20T05:25:31+05:30 IST