సబ్సిడీపై డ్రిప్‌ పరికరాల పంపిణీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-07-30T06:13:43+05:30 IST

సబ్సిడీపై డ్రిప్‌ పరికరాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తరెడ్డిపాలెంలోడ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగు చేస్తున్న జామ, పసుపు తదితర పంటల సాగును అంబటి కృష్ణారెడ్డి, శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య పరిశీలించారు.

సబ్సిడీపై డ్రిప్‌ పరికరాల పంపిణీకి ఏర్పాట్లు
చక్రాయపాలెంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న కృష్ణారెడ్డి, బాచిన కృష్ణచైతన్య

అద్దంకి లో పసుపు కొనుగోలు  కేం ద్రం ఏర్పాటు కు కృషి

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు అంబటి కృష్ణారెడ్డి 


అద్దంకి, జూలై 29 : సబ్సిడీపై డ్రిప్‌ పరికరాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తరెడ్డిపాలెంలోడ్రిప్‌ ఇరిగేషన్‌  ద్వారా సాగు చేస్తున్న జామ, పసుపు తదితర పంటల సాగును అంబటి కృష్ణారెడ్డి, శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య పరిశీలించారు. ప్రతి రైతు ఈ క్రాప్‌ నమోదు  చేయించుకోవటం ద్వారా పంట ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాలలో అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. దళారి వ్యవస్థ నుంచి  రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ఆర్‌బీకేలు  ఏర్పాటు చేసిందన్నారు. అద్దంకి ప్రాంతంలో పసుపు సాగు ఎక్కువగా  ఉన్నందున కొనుగోలు కేంద్రం  ఏర్పాటుకు  కృషి చేస్తానన్నారు.  ధాన్యం కొనుగోలు  సమయంలో తేమశాతంపై ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. సుబాబుల్‌ ధరల విషయాన్ని పలువురు రైతులు కృష్ణారెడ్డి దృష్టికి తీసుకు పోయారు. అనంతరం చ క్రాయపాలెం కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాచిన చెంచు ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి, జేడీఏ శ్రీనివాసరావు, ఏపీ ఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఏడీఏ ధన్‌రాజ్‌, ఏవో కొర్రపాటి  వెంకటకృష్ణ, ఉద్యానశాఖ ఏపీడీ జెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-30T06:13:43+05:30 IST