Advertisement

ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

Jan 23 2021 @ 23:13PM
గోనెల రాజు (ఫైల్‌)

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 23: మండలంలోని ఛాగల్లులో ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. సీఐ శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపిన ప్రకారం... మండలంలోని విశ్వనాథపురంకు చెందిన గోనెల రాజు(25) రాఘవపురంలోని ఓ వ్యక్తి వద్ద డోజర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కొత్తపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ బంధువులు స్టేషన్‌ఘన్‌పూర్‌-పాలకుర్తి రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసు కుంది. రాజుకు భార్య, ఒక కుమార్తె ఉంది.

Follow Us on:
Advertisement