NRI ఫాంహౌస్‌లో ఘోరం.. US నుంచి వచ్చినరోజే దంపతులపై డ్రైవర్ ఘాతుకం.. 50కిలోల బంగారంతో..

ABN , First Publish Date - 2022-05-08T15:12:12+05:30 IST

చెన్నైలోని ఫాంహౌస్‌లో ఎన్‌ఆర్‌ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కారు(టీఎన్‌ 07 ఏడబ్ల్యూ 7499)ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని..

NRI ఫాంహౌస్‌లో ఘోరం.. US నుంచి వచ్చినరోజే దంపతులపై డ్రైవర్ ఘాతుకం.. 50కిలోల బంగారంతో..

అమెరికా నుంచి వచ్చిన రోజునే ఎన్‌ఆర్‌ఐ దంపతుల హత్య

చెన్నైలోని సొంత ఫాంహౌస్‌లోనే ఘోరం

ఫామ్‌హౌస్‌ సిబ్బంది ఘాతుకంబంగారం, నగదుతో ఉడాయింపు.. ఒంగోలులో అదుపులోకి

ఒంగోలు(క్రైం), మే 7: చెన్నైలోని ఫాంహౌస్‌లో ఎన్‌ఆర్‌ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కారు(టీఎన్‌ 07 ఏడబ్ల్యూ 7499)ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్‌(58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్‌ ఉంది. శనివారం ఉదయం వారిద్దరూ విమానంలో చెన్నైకి వచ్చారు. వారి ఫాంహౌ్‌సలో నేపాల్‌కు చెందిన పధం లాల్‌శర్మ వాచ్‌మన్‌గా, అతని కుమారుడు పధం లాల్‌కృష్ణ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 


విమానాశ్రయం నుంచి  శ్రీకాంత్‌ దంపతులను కారులో ఫాంహౌ్‌సకు తీసుకొచ్చే సమయంలోనే లాల్‌కృష్ణ మార్గమధ్యంలో తన స్నేహితుడైన పశ్చిమబెంగాల్‌ డార్జిలింగ్‌కు చెందిన రవిని కారులో ఎక్కించుకున్నాడు. ఫాంహౌ్‌సకు తీసుకెళ్లిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం వారిని లాల్‌కృష్ణ, రవి హత్య చేసి, అక్కడే పాతిపెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును నాలుగు సూట్‌కేసుల్లో సర్దుకొని కారులో చెన్నై నుంచి నేపాల్‌కు బయలుదేరారు. చెన్నై పోలీసులకు విషయం తెలియడంతో అక్కడి ఏసీపీ డాక్టర్‌ కన్నన్‌ వెంటనే ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎస్పీ మలికగర్గ్‌ జాతీయ రహదారిపై ఉన్న అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్షణ్‌, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. 


సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్‌కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు సీఐ శ్రీరామ్‌ నిందితులను విచారిస్తున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ మలిక గర్గ్‌ అభినందించారు. చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చామని, నిందితులతో పాటు కారు, సూట్‌కేసులను వారికి అప్పగిస్తామని తెలిపారు. కాగా, ఆ సూట్‌కేసుల్లో 50 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఉన్నట్లు చెన్నై పోలీసుల సమాచారం.

Read more