Kerala: 259 మంది కేఎస్సార్టీసీ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు

ABN , First Publish Date - 2021-09-14T16:25:38+05:30 IST

గడచిన ఐదేళ్లలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 259 కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్సార్టీసీ) డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను మోటార్ వాహనాల శాఖ రద్దు చేసింది...

Kerala: 259 మంది కేఎస్సార్టీసీ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు

తిరువనంతపురం: గడచిన ఐదేళ్లలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 259 కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్సార్టీసీ) డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను మోటార్ వాహనాల శాఖ రద్దు చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, అజాగ్రత్తగా డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేశారు. 2016 మే నుంచి ఏప్రిల్ 2021 వరకు 259 మంది డ్రైవర్లపై మోటారు వెహికల్ డిపార్టుమెంట్ చర్యలు తీసుకుంది.2016 నుంచి జులై 2021 వరకు జరిగిన 2,05,512 రోడ్డు ప్రమాదాల్లో 22,076 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో 2,29,229 మంది గాయపడ్డారు.



కేరళ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేఎస్సార్టీసీ డ్రైవర్లతోపాటు 51,198 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు.2020లో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై తక్కువ వాహనాలు తిరిగాయి. 2020లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 883 మంది డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేశారు. కేరళలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన, ఓవర్ లోడింగ్, ట్రక్కుల్లో ప్రయాణికులను తీసుకువెళ్లడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు.

Updated Date - 2021-09-14T16:25:38+05:30 IST