అగ్నిమాపక శాఖకు డ్రోన్లు

ABN , First Publish Date - 2022-04-26T14:50:44+05:30 IST

అగ్నిప్రమాదాల నివారణ చర్యలకు అగ్నిమాపక శాఖకు రాష్ట్రప్రభుత్వం 50 డ్రోన్లు అందజేసింది. రాష్ట్రంలో గత ఏడాది సంభవించిన 16,809 అగ్నిప్రమాదాల్లో 16,421 అతి

అగ్నిమాపక శాఖకు డ్రోన్లు

పెరంబూర్‌(చెన్నై): అగ్నిప్రమాదాల నివారణ చర్యలకు అగ్నిమాపక శాఖకు రాష్ట్రప్రభుత్వం 50 డ్రోన్లు అందజేసింది. రాష్ట్రంలో గత ఏడాది సంభవించిన 16,809 అగ్నిప్రమాదాల్లో 16,421 అతి తక్కువ స్థాయి, 284 తక్కువ , 104 భారీ అగ్నిప్రమాదాలున్నాయి. అదే సమయంలో అగ్నిప్రమాదాలకు సంబంధించి 57,451 ఫిర్యాదులొచ్చాయి. వాటి కారణంగా 82 మంది మృతిచెందగా, 182 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మృతుల్లో అధికంగా విరుదునగర్‌ జిల్లాలో 31 మంది ఉండగా, కనిష్టంగా నీలగిరి జిల్లాలో 13 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 352 అగ్నిమాపక కేంద్రాల్లో 750 మంది పనిచేస్తున్నారు. దేశంలో అగ్నిప్రమాదాలు సంభవించే రాష్ట్రాల్లో తమిళనాడు 8వ స్థానంలోను, వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ వల్ల సంభవిస్తున్న ప్రమాదాల్లో మొదటిస్థానంలో ఉంది. ఈ క్రమంలో, తాజాగా ఆ శాఖకు 50 డ్రోన్లను ప్రభుత్వం అందజేసింది. ఒక్కో డ్రోన్‌ 1.200 కేజీల బరువుతో 30 నిముషాల వరకు ఎగిరే సామర్ధ్యం కలిగి ఉంది. అలాగే, 3 కి.మీ వరకు ఈ డ్రోన్‌ను పంపించవచ్చు. అటవీ ప్రాంతాలు, ఎత్తైన భవనాలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పడే అగ్నిప్రమాదాలను ఈ డ్రోన్ల ద్వారా సకాలంలో అదుపుచేసే అవకాశముందని అగ్నిమాపక శాఖ తెలిపింది.

Updated Date - 2022-04-26T14:50:44+05:30 IST