డ్రోన్ సర్వేను ప్రారంభిస్తున్న ప్రతిష్టా మాంగైన్
నూజివీడు రూరల్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను రీ సర్వే చేసి, రైతులకు సమస్యలు రాకుండా రికార్డులను క్రమబద్ధీకరిస్తుందని నూజివీడు సబ్‌కలెక్టర్ ప్రతిష్టా మాంగైన్ అన్నారు. మర్రిబంధంలో సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ రీ సర్వేను శనివారం ఆమె ప్రారంభించారు. తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీవో జి.రాణి పాల్గొన్నారు.