ధాన్యం దాచేదెక్కడ?

ABN , First Publish Date - 2020-10-19T10:01:15+05:30 IST

ధాన్యం దాచేదెక్కడ?

ధాన్యం దాచేదెక్కడ?

ఉమ్మడి జిల్లాలో ధాన్యం నిలువకు చోటు కరువు

గోదాంలలో ఖాళీ లేదు.. మిల్లుల్లో చోటు లేదు

గత వానాకాలం, యాసంగి సీజన్‌ల సీఎంఆర్‌ బియ్యం నేటికీ రైస్‌ మిల్లుల్లోనే

సరిపడా గోదాంలు లేక ఎదురవుతున్న సమస్య

ఇప్పటికే మొదలైన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

14 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం


కామారెడ్డి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వానాకాలం ధాన్యం దిగు బడి దండిగా రానుంది. అయితే, ఇందుకు అనుగుణంగా ఉ భయ జిల్లాల్లో ధాన్యం నిలువచేసే సామర్థ్యం పెరగడం లే దు. తాత్కాలిక సర్దుబాట్లతో అధికారులు కాలం వెళ్లదీస్తు న్నారు. నిలువల కోసం రైస్‌మిల్లులు, ఎఫ్‌సీఐపై ఆధారపడా ల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాలానుగుణంగా రైస్‌మిల్లుల సామర్థ్యం పెరగడం లేదు. దీనికి తోడు రైస్‌మిల్లులలో గత వానాకాలం, యాసంగి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఈ యేడు వానాకాలం ధాన్యం నిలువ చేయడం కష్ట మేనని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉభ య జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. ప్రతిఏటా ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్నా.. కేంద్రంలోనిధా న్యాన్ని తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీం తో అకాల వర్షాలతో కేంద్రాలలోనే ధాన్యం తడిసిపోతుండ డంతో అటు రైతులకు.. ఇటు ప్రభుత్వానికి సైతం నష్టం వా టిల్లుతోంది. ఈ అనుభవాల దృష్ట్యా రెండు జిల్లాల్లో ధాన్యం నిలువలకై సరిపడా గోదాంలను ఏర్పాటు చేయాల్సిన అవస రం అధికారులు, ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది.


ఉమ్మడి జిల్లాలో 400లకుపైగా రైస్‌ మిల్లులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 400లకు పైగా రైస్‌ మి ల్లులు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 250 రైస్‌మిల్లులు ఉంటే ఇందులో 200 రా రైస్‌మిల్లులు, 50 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో 151 రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఇందులో 116 రా రైస్‌ మిల్లులు, 35 బా యిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్‌లలో కోతల సమయంలో రైతుల నుంచి వరి ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మర ఆడించేందుకు ఈ రైస్‌ మిల్లులకు కేటాయిస్తుంటారు. రైస్‌ మిల్లర్లు మర ఆడించి ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి తిరిగి సీఎంఆర్‌ రైస్‌ను ఆయా మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. కానీ ఒక సీజన్‌లో కేటా యించిన ధాన్యాన్ని ఆ సీజన్‌లోనే మిల్లర్లు కేటాయించకుండా డీలా చేస్తూ వస్తు ంటారు. అధికారు లు అడిగే సరికి గోదాంలు ఖాళీ లేవని సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయా లని సమాధానం ఇస్తు న్నట్లు తెలుస్తోంది.


గత సీజన్‌ సీఎంఆర్‌ రైస్‌ నేటికీ మిల్లుల్లోనే

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో గత వానాకా లం, యాసంగి సీజన్‌లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఇప్పటికీ రైస్‌ మిల్లుల్లోనే ఉండిపోయింది. గత వా నాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఆయా రైస్‌ మిల్లులకు కేటాయించారు. ఆయా రైస్‌ మిల్లర్లు మర ఆడిం చి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సుమారు 12.25 లక్షల మెట్రిక్‌ ట న్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటికీ గత వానాకాలం, యాసంగి సీజన్‌ల సీఎంఆర్‌ రైస్‌ మిల్లర్‌లు ఇవ్వలేదు. మర ఆడించి బియ్యాన్ని సిద్ధంగా ఉంచినప్పటికీ జిల్లాల్లో సరిపడా గోదాం లు లేకపో వడంతో రైస్‌ మిల్లుల్లోనే మగ్గుతున్నాయి. కామా రెడ్డి జిల్లా లో గత వానాకాలం సీజన్‌లో 4.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించ గా.. 2.65 మెట్రిక్‌ టన్నుల సీ ఎంఆర్‌ రైస్‌ ప్రభుత్వానికి అప్పగించారు. యాసంగి సీజన్‌కుగాను 3.31 ల క్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయిం చగా.. 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ రైస్‌ను ప్రభుత్వానికి అం దించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 75 వేల మెట్రిక్‌ టన్ను లు మాత్ర మే రైస్‌ మిల్లర్లు ప్రభుత్వా నికి అప్పగించారు. మిగతా సీ ఎంఆర్‌ రైస్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ జిల్లాలో గోదాంలు ఖాళీ లేకపోవడంతో రైస్‌ మిల్లల్లోనే మగ్గుతున్నాయి.


ఖాళీ లేని గోదాంలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాంతో పాటు సాధారణ గోదాంలు 100కు పైగానే ఉన్నాయి. ఈ గోదాంల లో ఎఫ్‌సీఐ సంస్థయే అధిక కెపాసిటీ గల ధాన్యం నిలువ లు ఉంటాయి. నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌లో 15 వేల మెట్రిక్‌ టన్నులు నిల్వచేసే ఎఫ్‌సీఐ గోదాంలు ఉండగా.. ని జామాబాద్‌, ఆర్మూర్‌ పరిధిలో మరో నాలుగు ఎఫ్‌సీఐ గో దాంలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి శివారులోని ప్రస్తుత కలెక్టరేట్‌ సమీ పంలో 15 వేల మెట్రిక్‌ టన్నులు, నర్సన్నపల్లి వద్ద 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఎఫ్‌సీఐ గోదాంలు మాత్రమే ఉన్నా యి. అవి ఇప్పటికే ధాన్యం, బి య్యం నిల్వ లతో నిండి పోయాయి. ఇక మిగతా గో దాంలు ఎరువుల తో పాటు విత్త నాలు, మొక్కజొన్న, శనగ, పెసర, కందుల నిల్వలతో నిండిపోయా యి. దీంతో గోదాంలు ఖాళీ లేకపోవడంతో ప్రతి ఏటా ధా న్యం నిల్వలకై ఇబ్బందులు ఎదురవు తున్నట్లు అధికా రులతో పాటు రైస్‌ మిల్లర్లు సైతం వాపోతున్నారు. దీంతో మర ఆడించిన బియ్యాన్ని రైస్‌ మిల్లర్ల వద్దనే ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.


14 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు రానున్న వానాకాలం ధాన్యం 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం దిగుబడి దండిగానే రానుంది. ఈ సీజన్‌లో ఉభయ జిల్లాల్లో వరి పంటను విస్తారంగా సాగు చేశారు. సుమారు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుంద ని అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3.75 లక్షల ఎకరాలలో వరి పంట సాగుకాగా.. సుమారు 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచ నా వేశారు. ధాన్యం కొనుగోలుకు 445 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పలుచోట్ల ధాన్యం కొనుగోలు చేపట్టారు.  కామారె డ్డి జిల్లాలో 2లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. సుమారు 4.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలును అధికారు లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 330 కేంద్రాలను ఏర్పాటు చేసి.. రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యాన్ని 151 రైస్‌ మిలుల్ల కు కేటాయించారు. అయితే సమస్య అంతా ఇక్కడే ఏర్పడ నుంది. ఇప్పటికే ఆయా రైస్‌ మిల్లుల్లో ధాన్యంతో పాటు మ ర ఆడించిన సీఎంఆర్‌ రైస్‌ నిల్వలు ఉన్నాయి. అయితే, ఈ వానాకాలంలో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తా రనే దానిపై రైస్‌ మిల్లర్లలో అయోమ యం నెలకొంది.

Updated Date - 2020-10-19T10:01:15+05:30 IST