పల్లెప్రగతి పనుల్లో నాణ్యత కరువు!

ABN , First Publish Date - 2021-10-26T05:39:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులు పక్కదారి పడుతున్నాయి. అసలే నత్తనడక ఆపై పనుల్లో నాణ్యత లేకపోవడంతో నగుబాటుగా మారుతున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వం పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులను మంజూరు చేస్తున్నా కొందరు సర్పంచ్‌లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపలున్నాయి. ప్రస్థుతం గ్రా మాల్లో శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాల ని ర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ సంబంధిత అధికారులు గడువులోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కనిపిస్తుంది.

పల్లెప్రగతి పనుల్లో నాణ్యత కరువు!
కూలిపోయిన నిర్మాణం

ప్రారంభానికి ముందే పడిపోతున్న నిర్మాణాలు

అడ్డగోలుగా చేపడుతూ చేతులు దులుపుకుంటున్న నాయకులు 

పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం 

ఆదిలాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులు పక్కదారి పడుతున్నాయి. అసలే నత్తనడక ఆపై పనుల్లో నాణ్యత లేకపోవడంతో నగుబాటుగా మారుతున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వం పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులను మంజూరు చేస్తున్నా కొందరు సర్పంచ్‌లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపలున్నాయి. ప్రస్థుతం గ్రా మాల్లో శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాల ని ర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ సంబంధిత అధికారులు గడువులోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కనిపిస్తుంది. 

జిల్లాలో 468 గ్రామ పంచాయతీల్లో.. 

జిల్లాలో 468 పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నా యి. ఇప్పటికీ పదికి పైగా గ్రామాలలో పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. పూర్తయిన నిర్మాణాలు బీటలు వారి పోతున్నాయి. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన పనులు మున్నాళ్ల ముచ్చటానే మారుతున్నాయి. దీంతో ఇవేం పనులంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఇంత అధ్వానంగా పల్లెప్రగతి పనులు చే పడుతున్న అధికార యంత్రాంగం మాత్రం అంతా సక్రమంగానే ఉందంటూ ప్రభుత్వానికి తప్పు డు నివేదికలు ఇస్తూ తప్పించుకుంటున్నారనే విమర్శలు లేక పోలేదు.

శ్మశానం నిర్మాణంలో కక్కుర్తి..

కొందరు సర్పంచ్‌లు, అధికారులు శ్మశాన పనుల్లోనూ కక్కుర్తి పడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇటీవల కూలిపోయిన నిర్మాణా లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడే నాలుగుపైసలు వెనుకేసుకోవాలనే అత్యాశతో నా మ్‌కే వాస్తేగా పనులు చేపడుతు చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటి వరకు పనులు పూర్తికాకున్నా కొందరు సర్పంచ్‌లు పూర్తిస్థాయి లో బిల్లులు స్వాహా చేసినట్లు తెలుస్తుంది. ఏదో ని ర్మించామా వదిలేశామా అన్న చందంగా తీరు కనిపిస్తుంది. పంచాయతీ పరిధిలో ఏ పని చేసిన సంబంధిత అధికారులు పర్సంటేజి లకు ఆశపడడంతో నాసి రకం పనులకు పునాదులు పడుతున్నాయి. ఇటు సర్పంచ్‌లు, అటు అధి కారులు తలోకొంత జేబులో వేసుకునేందుకు ప్రయత్నాలు చేయడంతోనే పనుల్లో నాణ్యత లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. తమకున్న రాజకీయ, ఆర్థిక పరపతితో సర్పంచ్‌లు అధికారుల పై ఒత్తిడి తెస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేక పోలేదు. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డగోలుగా అభివృద్ధి పనులు చేపట్టడంతో మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అసలు అడిగేనాథుడే కరువవడంతో ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గందరగోళంగా పనులు

జిల్లాలో నిర్మిస్తున్న శ్మశాన వాటికలలో ఎక్క డ నాణ్యత ప్రమాణాలు పట్టిం చుకున్నట్లు కనిపించడమే లేదు. పనుల పై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాం టి పరిస్థితులకు దారి తీస్తుందన్న విమర్శలున్నాయి. సిరికొండ మండలం ఫకీర్‌నాయక్‌తండా, నేరడిగొండ మండలం కుంటాల(బి), యాపల్‌గూడ గ్రామాల్లో పనులు గందరగోళంగా కనిపిస్తున్నాయి. కుంటాల (బి) శ్మశాన వాటికలో స్నానాల గది నేలమట్టం కాగా ఫకీర్‌నాయక్‌ తండాలో స్లాబు నాణ్యత లేక పడిపోయింది. దీంతో మళ్లీ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం అంతా సక్రమంగానే ఉందని చెబుతున్నా పరిస్థితి మాత్రం భిన్నం గా ఉంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

శ్రీనివాస్‌ (జిల్లా పంచాయతీ అధికారి,ఆదిలాబాద్‌)

జిల్లాలో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను తరు చూ పర్యవేక్షణ చేస్తున్నాం. నాణ్యతపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేని నిర్మాణాలను తిరిగి నిర్మించేలా చూస్తాం. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల పనులు దెబ్బతిన్నట్లు మా దృష్టికి వచ్చింది. నాణ్యత కారణంగానే కూలిపోతే బిల్లులను నిలిపి వేసి చర్యలు తీసుకుంటాం. మండల స్థాయి అధికారులు కూడా పనులను ప రిశీలించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు.


Updated Date - 2021-10-26T05:39:23+05:30 IST