దేశ 15వ రాష్ట్రపతిగా Droupadi Murmu ప్రమాణం

ABN , First Publish Date - 2022-07-25T15:53:02+05:30 IST

దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

దేశ 15వ రాష్ట్రపతిగా Droupadi Murmu ప్రమాణం

న్యూఢిల్లీ : దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముర్ముతో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ(NV Ramana) ప్రమాణం చేయించారు. రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సీజేఐగా ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య(Venkaiah Naidu), ప్రధాని మోదీ(PM Modi), స్పీకర్‌ ఓంబిర్లా.. కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.


భారత తొలి ఆదివాసి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. దేశ రెండవ మహిళా రాష్ట్రపతిగానూ ఆమె నిలిచారు. అంతేకాదు స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా ఈమె కావడం గమనార్హం.


Updated Date - 2022-07-25T15:53:02+05:30 IST