ద్రౌపది ముర్ము గెలుపుపై Bjpలో సంబరాలు

ABN , First Publish Date - 2022-07-22T13:13:16+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘనవిజయం సాధించడం తో నగరంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గురువారం సా

ద్రౌపది ముర్ము గెలుపుపై Bjpలో సంబరాలు

ప్యారీస్‌(చెన్నై), జూలై 21: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘనవిజయం సాధించడం తో నగరంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గురువారం సాయంత్రం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. టి.నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయం వద్ద టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి పార్టీ నాయకులు హర్షాతిరేకాలు ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు డప్పులు వాయిస్తూ నృత్యం చేశారు.

Updated Date - 2022-07-22T13:13:16+05:30 IST