రైతుల ఆందోళనతో దద్దరిల్లిన మునగపాక

ABN , First Publish Date - 2021-09-18T06:01:03+05:30 IST

రైతుల ఆందోళనతో మునగపాక దద్దరిల్లింది. ‘రైతు కోసం తెలుగుదేశం’లో భాగంగా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు శుక్రవారం ఇక్కడ భారీ ఆందోళన చేపట్టారు. తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావులు ఎడ్ల బండిపై చెరకు గడలు పట్టు కొని, ఊరేగి తమ నిరసనను తెలియజేశారు.

రైతుల ఆందోళనతో దద్దరిల్లిన మునగపాక
మునగపాకలో రైతులు, టీడీపీ శ్రేణుల ఆందోళన


 ‘రైతు కోసం తెలుగుదేశం’కు భారీగా తరలి వచ్చిన అన్నదాతలు

 ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన శ్రేణులు

 తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడితో సహా 35 మంది అరెస్టు, విడుదల

మునగపాక, సెప్టెంబరు 17: రైతుల ఆందోళనతో మునగపాక దద్దరిల్లింది. ‘రైతు కోసం తెలుగుదేశం’లో భాగంగా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు శుక్రవారం ఇక్కడ భారీ ఆందోళన చేపట్టారు. తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ మండల  అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావులు ఎడ్ల బండిపై చెరకు గడలు పట్టు కొని, ఊరేగి తమ నిరసనను తెలియజేశారు. ఈ సంద ర్భంగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు  సీఎంగా ఉన్నప్పుడు రైతులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసేవారన్నారు.  ఈ ప్రభుత్వం రైతులకు ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్‌ చార్జీలు వసూలు చేయడం కోసమే మీటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు. మీటర్లు బిగిస్తే రైతులు సహించరని హెచ్చరించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.  ఎన్నికల్లో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే, రైతులనుద్దేశించి నాయకులు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు అడ్డుతగిలారు.  శ్రీనివాసరెడ్డి నుంచి మైకు లాక్కునేందుకు సీఐ శ్రీనివాసరావు ప్రయత్నించి నప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరోనా సమయంలో  నిబంధనలకు విరుద్ధంగా  సమావేశం ఏర్పాటు చేసినందున నాయకులపై కేసు నమోదు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అనంతరం విడిచిపెట్టారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి దాడి ముసిలినాయుడు, టీడీపీ నాయకులు ఆడారి మంజు, భీమరశెట్టి శ్రీనివాసరావు, కడియం అనూరాధ, డొక్కా నాగభూషణం, కె.వీరరాజశేఖర్‌, కె.రామనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషం: ప్రగడ

అచ్యుతాపురం : చెత్తపై పన్ను వేసేవాళ్లను చెత్త పాలకులని అనకుండా ఇంకేమని అంటారని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరిచే విధంగా లేవన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడం తప్పా.. ఆయన ప్రశ్నిం చారు. చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషమని పేర్కొన్నారు. నాయకులు ఆర్‌.రమేష్‌కుమార్‌, జె.నరసింగరావు, కూనిశెట్టి రమణ, లాలం రాము పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:01:03+05:30 IST