డ్రగ్‌ రెసిస్టెన్స్‌!

ABN , First Publish Date - 2021-04-06T05:32:31+05:30 IST

జలుబు, దగ్గులాంటి రుగ్మతలకు సాధారణంగా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. లేదంటే మెడికల్‌ షాప్‌కి వెళ్లి మందులు కొని వాడేస్తూ ఉంటాం...

డ్రగ్‌ రెసిస్టెన్స్‌!

జలుబు, దగ్గులాంటి రుగ్మతలకు సాధారణంగా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. లేదంటే మెడికల్‌ షాప్‌కి వెళ్లి మందులు కొని వాడేస్తూ ఉంటాం. బాక్టీరియల్‌, వైరల్‌...వీటిలో ఏ రకమైన ఇన్‌ఫెక్షనో తెలియదు, వీటికి ఎంతకాలంపాటు మందులు వాడాలో తెలియదు. అయినా చేతికి అందిన మందుల్ని వేసేసుకుంటాం. ఒకవేళ వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్‌ అయినా ఇన్‌ఫెక్షన్‌ కాస్త కంట్రోల్‌ కాగానే పూర్తి కోర్సు వాడకుండా మానేస్తూ ఉంటాం. ఇలా ఓవర్‌ ది కౌంటర్‌ మందులు వాడటం, పూర్తి మోతాదు వాడకపోవటం వల్ల మైక్రోఆర్గానిజమ్స్‌ మందులకు లొంగినట్టే లొంగి, మరో కొత్త రూపంలో ఇతరులకు వ్యాపిస్తూ ఉంటాయి. ఇలా సూక్ష్మజీవులు మందులకు స్పందించనంత సామర్ధ్యాన్ని పెంచుకుంటూ చివరికి ఎంత సమర్ధమైన చికిత్సకూ లొంగనంత మొండిగా తయారవుతున్నాయి. 


ఏడాది కాలంలో యాంటీబయాటిక్స్‌ వాడకంలో మన దేశం చైనా, అమెరికాలను మించిపోయిందని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాంటీ మైక్రోబియిల్‌, సర్వే చేపట్టి ఓ నివేదికలో వెల్లడించింది. అమెరికాలో యాంటీబయాటిక్స్‌ వాడకం సంవత్సరానికి 7 బిలియన్లు, చైనాలో 10 బిలియన్లే ఉంటే మన దేశం 13 బిలియన్లకు చేరిపోయిందని ఈ సర్వేలో తేలింది. ఈ దుస్థితి మెరుగు పడాలంటే అవసరమైనప్పుడు తప్ప మందులు వాడకపోవటం, వాడినా వైద్యులు సూచించిన మందుల్ని, సూచించినంత పరిమితకాలంపాటే వాడేలా నియమాలు పాటించటం అలవాటు చేసుకోవాలి


Updated Date - 2021-04-06T05:32:31+05:30 IST