వర్సిటీ, కాలేజీ, ఐటీ కంపెనీల్లో జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు: సీపీ ఆనంద్

ABN , First Publish Date - 2022-02-27T01:13:22+05:30 IST

నగరంలోని వర్సిటీ, కాలేజీ, ఐటీ కంపెనీల్లో జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయని నగర సీపీ

వర్సిటీ, కాలేజీ, ఐటీ కంపెనీల్లో జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు: సీపీ ఆనంద్

హైదరాబాద్‌: నగరంలోని వర్సిటీ, కాలేజీ, ఐటీ కంపెనీల్లో జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయని నగర సీపీ ఆనంద్  తెలిపారు. నగర కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. అరెస్టైనవారిలో 11 మంది సాఫ్ట్‌వేర్లు, 8 మంది విద్యార్థులు, డాక్టర్‌ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పలు ఐటీ కంపెనీలకు సంబంధించిన ఉన్నతాధికారులను అరెస్ట్‌ చేశామన్నారు. హౌజ్‌పార్టీల పేరిట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు డ్రగ్స్‌ సేవిస్తున్నారన్నారు. ప్రతి వీకెండ్‌లో హౌజ్‌ పార్టీలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. డ్రగ్స్‌ అమ్మకాల్లో డెలివరీ బాయ్స్‌ కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.  


డ్రగ్స్‌తో  సంబంధమున్న వారి వివరాలను ఆయన వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సాయి విగ్నేష్, కూకట్‌పల్లిలోని ప్రతిభ డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి చైత్ర, కేపీహెచ్‌బీలోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థి నాగార్జున, కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి జై బాలాజీ ఉన్నారు. నోవార్టిస్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి హేమంత్, డీఎక్స్‌సీ టెక్నాలజీ డాటా సెంటర్ ఆపరేటర్ సాయి బాలాజీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ అనుదీప్, టెక్ మహీంద్రా, టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగి తేజస్విని కుమార్, డెలాయిట్ సీనియర్ అనలిస్ట్ నుడురుపాటి రమ్య సిద్ధార్థ, అమెజాన్ డాటా ఇంజనీర్ అనీష్ కుమార్, కంటెల్లిగేన్స్ ఐటీ కంపెనీ ఫౌండర్ సాయి అనిరుద్, కాగ్నిజెంట్‌ ఐటీ అనలిస్ట్ ఖుషి మిషన్, డిలైట్ బిజినెస్‌ కన్సల్టెంట్ సిద్ధార్థ విజయ్ కుమార్, షానికా గ్లోబల్ ఐటీ కంపెనీ హెచ్ఆర్‌ హెడ్ రోహిత్ కుమార్, హిందూజ గ్లోబల్ అకౌంటెంట్ బాలాజీ భార్గవ్ సింగ్ ఉన్నారన్నారు.


గుజరాతి సోషల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన లకానీ, సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్గో సర్వీస్ సూపర్‌వైజర్ చిటుకుల సమరసింహారెడ్డికి దీనితో సంబంధముందన్నారు. నైజీరియన్ అయిన  కోలస్ క్లాత్ బిజినెస్ చేస్తున్నాడని, సికింద్రాబాద్ చెందిన డీజే ప్లేయర్ నిఖిల్ ఉన్నాడన్నారు. సోనీరావు, లాఖన్, గంజాయి సాగుదారులని ఆయన తెలిపారు. 

  

 బంజారాహిల్స్‌‌లోని ప్రైమరీ హాస్పిటల్‌లో పనిచేసే  డాక్టర్ మండే,  అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్‌ మేనేజర్ ఆదిత్య రాజన్, స్టాక్ మార్కెట్ ట్రేడర్ పాండేలకు డ్రగ్స్ తో సంబంధముందని సీపీ తెలిపారు.  అంతేకాకుండా జొమాటో డెలివరీ బాయ్ మహేందర్ సింగ్ ఉన్నారని సీపీ పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-27T01:13:22+05:30 IST