బెంగళూరులో భారీగా పట్టుబడిన మాదక ద్రవ్యాలు

ABN , First Publish Date - 2021-09-29T21:26:21+05:30 IST

కర్నాటక: బెంగళూరులో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.

బెంగళూరులో భారీగా పట్టుబడిన మాదక ద్రవ్యాలు

కర్నాటక: బెంగళూరులో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇరాన్‌కు చెందిన ఎంబీయే గ్రాడ్యుయేట్ విల్లాలో కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితోపాటు ఇద్దరు ఇరానియన్ జాతీయులు సహా నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడు జవాద్ బడిదెలోని రామ్‌నగర్‌లో ఓ విల్లాను గంజాయి తోటగా మార్చాడు. తన విల్లాలో హైడ్రో గంజాయిని పెంచాడని పోలీసులకు సమాచారం అందడంతో విల్లాపై దాడి చేసి కంటైనర్‌లలో నిలువ ఉంచిన హైడ్రో గంజాయి మొక్కలు, గంజాయి పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-09-29T21:26:21+05:30 IST