Drunk Air Hostess: మద్యం తాగిన ఎయిర్ హోస్టెస్...రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి రచ్చ

ABN , First Publish Date - 2022-08-13T15:30:59+05:30 IST

ఓ ఎయిర్ హోస్టెస్ పీకల దాకా మద్యం తాగి(Drunk Air Hostess) ఆమె స్నేహితులతో కలిసి రెస్టారెంటులో రచ్చ చేసిన(Friends Create Ruckus) ఘటన...

Drunk Air Hostess: మద్యం తాగిన ఎయిర్ హోస్టెస్...రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి రచ్చ

జైపూర్ (రాజస్థాన్): ఓ ఎయిర్ హోస్టెస్ పీకల దాకా మద్యం తాగి(Drunk Air Hostess) ఆమె స్నేహితులతో కలిసి రెస్టారెంటులో రచ్చ చేసిన(Friends Create Ruckus) ఘటన రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో జరిగింది. జైపూర్ నగరంలోని ఒక రెస్టారెంటులో( Restaurant) ఎయిర్ హోస్టెస్ ప్రాచీసింగ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం తాగి రభస సృష్టించారు. ప్రాచీసింగ్ ఆమె స్నేహితులు రెస్టారెంటులో ఓ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు అనంతరం రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక బీరు బాటిల్ తో ఘర్షణ పడిన కుటుంబీకుల కారు అద్దాన్ని పగలగొట్టారు.


బాధితుల ఫిర్యాదు మేర ప్రాచీ సింగ్,  ఆమె భర్త కార్తీక్ చౌదరి, వికాస్ ఖండేల్వాల్, నేహాలపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన విశాల్ దూబే, ఆర్యాలను కూడా అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.



Updated Date - 2022-08-13T15:30:59+05:30 IST