ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన మహిళ!

ABN , First Publish Date - 2020-11-14T22:13:51+05:30 IST

ఫుల్లుగా మందుకొట్టిన ఓ మహిళ రోడ్డు ఏదో, రైల్వే ట్రాక్ ఏదో తెలియకుండా కారు నడిపి చివరికి కటకటాలపాలైంది. మద్యం తాగేందుకు చట్టపరంగా

ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన మహిళ!

స్పెయిన్: ఫుల్లుగా మందుకొట్టిన ఓ మహిళ రోడ్డు ఏదో, రైల్వే ట్రాక్ ఏదో తెలియకుండా కారు నడిపి చివరికి కటకటాలపాలైంది. మద్యం తాగేందుకు చట్టపరంగా ఉన్న పరిమికి మూడురెట్లు అధికంగా మద్యం తాగిన ఆమె దాదాపు కిలోమీటరున్న దూరం రైల్వే ట్రాక్‌పై కారు నడిపింది. మూడు టైర్లు పంక్చర్ కావడంతో చివరికి పట్టాలపై కారు నిలిచిపోయింది కానీ లేకుంటే ఇంకా దూసుకెళ్లేదే. స్పెయిన్‌లోని మాలగాలో ఈ నెల 7న జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  టైర్లు పంక్చర్ కావడంతో ఓ టన్నెల్ ప్రారంభంలో పట్టాలపై కారు చిక్కుకుపోయినట్టు గుర్తించిన మాలగా మెట్రో సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటకు తీశారు. 


25 ఏళ్ల మహిళ ఆ మహిళకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో లీటరుకు 0.85 మిల్లీగ్రాముల ఆల్కహాలు చూపించింది. ఇది చట్టపరంగా అనుమతించే పరిమితికి మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు గాను ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పట్టాలపై కారు నడపడం వల్ల ట్రాక్ దెబ్బతినకపోయినప్పటికీ రైళ్ల రాకపోకలను మాత్రం రెండు గంటలపాటు నిలిపివేశారు. 



Updated Date - 2020-11-14T22:13:51+05:30 IST