Viral Video: పెళ్లి వేదిక మీదే వరుడి చెంప పగలగొట్టిన వధువు సోదరి.. కారణమేంటో వీడియోలో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-06-24T02:20:37+05:30 IST

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఎంతో ఆహ్లాదంగా జరిగే పెళ్లి వేడుకలో వధూవరుల మీదే అందరి కళ్లూ ఉంటాయి.

Viral Video: పెళ్లి వేదిక మీదే వరుడి చెంప పగలగొట్టిన వధువు సోదరి.. కారణమేంటో వీడియోలో మీరే చూడండి..

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఎంతో ఆహ్లాదంగా జరిగే పెళ్లి వేడుకలో వధూవరుల మీదే అందరి కళ్లూ ఉంటాయి. అలాంటి ఓ వేడుకలో వరుడు అత్యంత హేయంగా ప్రవర్తించాడు. తన వివాహానికి కూడా వీపరీతంగా మద్యం సేవించి వచ్చాడు. వధువు మెడలో దండ వేసే సమయంలో కూడా ఊగిపోతూ కనిపించాడు. అయినా అతడి చేత వధువు తన మెడలో దండ వేయించుకుంది. అయితే వరుడు ఆమె మెడలో దండ వేసేందుకు ఆపసోపాలు పడ్డాడు. 


వేదిక మీద మద్యం మత్తులో తూలుతున్న వరుడిని వెనుక నుంచి ఓ వ్యక్తి పట్టుకోవాల్సి వచ్చింది. వధువు మెడలో మాల వేసేందుకు అతను చాలా ప్రయత్నించాడు. చివరకు వధువు పక్కన ఉన్న ఆమె సోదరి మెడలో వేసేశాడు. దీంతో ఆమె వేదిక మీదే వరుడి చెంప పగలగొట్టింది. ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుడి తీరుపై సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. 

Updated Date - 2022-06-24T02:20:37+05:30 IST