భార్యాభర్తలిద్దరూ పార్టీ చేసుకున్నారు.. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.. మందు తాగుతూ చివరగా భార్యతో ఇలా అన్నాడు..

Published: Fri, 04 Feb 2022 16:29:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భార్యాభర్తలిద్దరూ పార్టీ చేసుకున్నారు.. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.. మందు తాగుతూ చివరగా భార్యతో ఇలా అన్నాడు..

భర్త అల్లరిచిల్లరిగా తిరిగితే భార్య, భార్య తప్పు చేస్తే భర్త మందలించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడూ గొడవలు ముదిరి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంటాయి. దంపతుల్లో ఎవరో ఒకరు.. సహనంతో ఉంటూ సత్ప్రవర్తనతో మెలిగితే ఎలాంటి గొడవలూ ఉండవు. ఛత్తీస్‌గఢ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు. భర్త మందు కొడుతూ భార్యతో ఒక్క మాట అన్నాడు. అనంతరం ఈ గొడవ ఎంతవరకు వెళ్లిందంటే..

పోలీసుల కథనం మేరకు.. ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్ జిల్లా కోటగహ్నా గ్రామానికి చెందిన సతీష్, కుమారి (పేర్లు మార్చాం) దంపతులు. వివాహమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ లేకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో సమస్యలు తలెత్తాయి. కుమారి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడమే సమస్యలకు దారితీసింది. ఈ విషయంలోనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన భార్యాభర్తలు ఇద్దరూ మందు పార్టీ చేసుకున్నారు. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.

మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ.. సంతోషంగా ఉండకుండా.. ప్రియుడితో కలిసి ఇలా చేస్తుందనుకోలేదు..

దంపతులిద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో భార్యతో సతీష్ అన్న మాట గొడవకు దారి తీసింది. ‘‘ నీ క్యారెక్టర్ నాకు నచ్చడం లేదు.. నాకు తెలీకుండా ఇంకొకరితో తిరగడం బాగోలేదు’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తానేమీ తప్పు చేయలేదని భార్య నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ‘‘తప్పు చేసి, మళ్లీ నన్నే నమ్మించే ప్రయత్నం చేస్తావా’’.. అంటూ ఒక్కసారిగా కర్రతో భార్యపై దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత సతీష్.. అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసు విచారణలో సతీష్ నేరాన్ని అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేశారు.

హోటల్‌లో స్నేహితురాలితో గడిపిన యువకుడు.. కొన్నాళ్లకు ఫోన్‌లో సీన్ టూ సీన్ ప్రత్యక్షం.. అసలేం జరిగిందంటే..

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.