‘దృశ్యం2’ సరికొత్త సెన్సేష‌న్‌

Jun 2 2021 @ 21:22PM

స‌రైన కంటెంట్ ఉంటే చాలు ఓ సినిమా ప్రేక్ష‌కులను మెప్పించ‌డానికి అన‌డానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘దృశ్యం 2’. ఈ చిత్రం ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. వివరాల్లోకెళ్తే...మోహ‌న్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ సినిమా విడుద‌లైంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19న కొవిడ్ ప్ర‌భావంతో డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా మ‌రో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన అన్నీ చిత్రాల్లో ‘దృశ్యం 2’ చిత్రానికే ఐఎండీబీ రేటింగ్ ఎక్కువ‌గా వ‌చ్చింది. 8.8 యూజ‌ర్ రేటింగ్‌తో ‘దృశ్యం 2’ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకుంది. మ‌రి ఈ రికార్డ్‌ను ఏ సినిమా క్రాస్ చేస్తుందో చూడాలి. ‘దృశ్యం 2’ సినిమాను ఇప్పుడు తెలుగులో వెంక‌టేశ్ హీరోగా జీతూ జోసెఫ్ తెర‌కెక్కిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.