డ్రై ఫ్రూట్‌ చిక్కీ

ABN , First Publish Date - 2020-02-22T17:59:42+05:30 IST

వేరుసెనగలు - 100 గ్రాములు, జీడిపప్పు - 100 గ్రాములు, వాల్‌నట్స్‌ - 100 గ్రాములు, బాదం - 50 గ్రాములు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార

డ్రై ఫ్రూట్‌ చిక్కీ

కావలసినవి : వేరుసెనగలు - 100 గ్రాములు, జీడిపప్పు - 100 గ్రాములు, వాల్‌నట్స్‌ - 100  గ్రాములు, బాదం - 50 గ్రాములు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - 350గ్రా., తేనె - 350గ్రా., వెన్న - రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, తినేసోడా - అర టీస్పూన్‌.


తయారీ : వేరుసెనగలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌, బాదం, సోంపును చిన్నమంటపై వేగించాలి. 

తరువాత ఆ మిశ్రమంలో పంచదార, తేనె, నీళ్లు పోసి ఉడికించాలి.

మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.

ఇప్పుడు స్టవ్‌పై నుంచి దింపి నిమ్మరసం, వెన్న, తినేసోడా వేసి కలియబెట్టాలి. 

దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి. 

చల్లారి, గట్టిగా అయిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.

వీటిని డబ్బాలో భద్రపరిచి పిల్లలకు అప్పుడప్పుడు ఇస్తుంటే ఇష్టంగా తింటారు.


Updated Date - 2020-02-22T17:59:42+05:30 IST