డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-07-06T05:50:43+05:30 IST

: వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమాన్ని పకడ్భంధీగా నిర్వహించానలి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు.

డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
వేములవాడలో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌ /వేములవాడ, జూలై 5 : వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమాన్ని పకడ్భంధీగా నిర్వహించానలి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌నుంచి మంగళవారం సాయంత్రం మండల వైద్యాధికారులతో సీజనల్‌ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో క్రమం తప్పకుండా డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో, అన్నీ మండల కేంద్రాలు, గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులను నివారించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, డీపీవో రవీందర్‌, జిల్లా అసుపత్రిసూపరింటెండెంట్‌ డాక్టర్‌ మరళీధర్‌రావు, అధికారులు పాల్గొన్నారు. 

  సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వేములవాడ పట్టణంలోని 25, 26, 27వ వార్డుల్లో మంగళవారం  ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ  మంగళ, శుక్రవారాల్లో జిల్లాలో డ్రై డే పాటిస్తున్నామని, ఇందులో భాగంగా సంబంధిత అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి ఇంటి ఆవరణలో నిలువ ఉన్న నీటిని తొలగించి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు తమ ఇంటి ఆవరణలో ఎలాంటి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలన్నారు. నీరు నిలువ ఉండడంతో దోమలు పెరిగి జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యాం సుందర్‌ రావు, మేనేజర్‌ సంపత్‌ రెడ్డి, కౌన్సిలర్లు గూడూరి లక్ష్మి, ముప్పిడి సునంద, గోలి మహేశ్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నగేశ్‌, అంగన్‌వాడీ టీచర్‌ కే జ్యోతి, ఆశా వర్కర్‌  వైష్ణవి, నాయకులు రామతీర్థపు రాజు, గూడూరు మధు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-06T05:50:43+05:30 IST