వంటలు

డ్రైఫ్రూట్స్‌ లడ్డూ

డ్రైఫ్రూట్స్‌ లడ్డూ

కావలసిన పదార్థాలు: కర్జూరాలు (కట్‌ చేసినవి): ఓ కప్పు, బాదాం : సగం కప్పు, జీడి పప్పు: సగం కప్పు, ఎండు అంజీర్‌ : ఎనిమిది, ఎండు ద్రాక్ష: సగం కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు: సగం కప్పు, యాలకుల పొడి: కాస్త.


తయారు చేసే విధానం: ముందుగా బాదాం గింజలను దోరగా వేయించుకోవాలి.  కర్జూరం ముక్కలు, అంజీర్‌, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. ఆ తరవాత వేయించిన బాదాం వేసి ఇంకోసారి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్నంతా ఓ గిన్నెలోకి తీసుకుని చేత్తో ఒక్కో లడ్డూ కడితే సరి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.