డీఎస్సీ 1998 అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-20T04:39:08+05:30 IST

డీఎస్సీ 1998 బ్యాచ్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ 1998 అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి
ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

కొవ్వూరు, జూన్‌ 19 : డీఎస్సీ 1998 బ్యాచ్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్‌ సభ్యు లు పి.బెనర్జి మాట్లిడుతూ 98లో నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించినప్పటికి అప్పటి ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగాలు పొందలేకపోయామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో పి.కుటుంబరావు, ఈ.జాన్‌, జయకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:39:08+05:30 IST