Dsp నివాసంలో Acb తనిఖీలు

ABN , First Publish Date - 2022-04-07T15:33:12+05:30 IST

లంచం కేసులో అరెస్టయిన నాగర్‌కోవిల్‌ క్రైం డీఎస్పీ తంగవేలు నివాసం, కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.10లక్షల నగదు పట్టుబడింది. నాగర్‌కోవిల్‌

Dsp నివాసంలో Acb తనిఖీలు

                         - రూ.10లక్షల స్వాధీనం


చెన్నై: లంచం కేసులో అరెస్టయిన నాగర్‌కోవిల్‌ క్రైం డీఎస్పీ తంగవేలు నివాసం, కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.10లక్షల నగదు పట్టుబడింది. నాగర్‌కోవిల్‌ పున్నైనగర్‌కు చెందిన జౌళి దుకాణ యజమాని శివగురు కుట్రాలం ఓ స్థలాన్ని కొనుగోలు చేయడంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు డీఎస్పీ తంగవేలు రూ.5లక్షల లంచం అడిగారు. ఈ విషయాన్ని జౌళి దుకాణం యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేర కు శివగురు కుట్రాలం నుంచి రసాయనాలను పూసిన కరెన్సీని డీఎస్పీ తంగవేలు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఆతర్వాత మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు ఏసీబీ అధికారులు డీఎస్పీ తంగవేలును విచారించారు. బుధవారం ఉదయం రామన్‌పుదూరు జంక్షన్‌ వద్దనున్న తంగవేలు నివాసం, కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లంచం కేసులో చిక్కుకున్న తంగవేలు కోవై జిల్లా సూలూరు ప్రాంతానికి చెందినవారని, విధినిర్వహణలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు పలు ఫిర్యాదులు కూడా వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-07T15:33:12+05:30 IST