పలు చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-09T11:08:09+05:30 IST

జిల్లాలో పలు చోరీ లకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రూ. లక్షన్నర విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్‌ ..

పలు చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్‌

రూ.లక్షన్నర సొత్తు రికవరీ


ఒంగోలు(క్రైం), ఆగస్టు 8: జిల్లాలో పలు చోరీ లకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి  రూ. లక్షన్నర విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడిం చారు. నగరంలోని పేర్న మిట్ట అరుణోదయ కాలనీలో నివాసం ఉండే షేక్‌ రాహుల్‌ మద్యానికి బానిసై దొంగగా మరాడు. దోచిన డబ్బుతో క్రికెట్‌ బెట్టింగ్‌, జల్సాలు చేస్తూ ఉన్నాడు. ఈనేపథ్యంలో సంతనూతలపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ రాజారావు శనివారం ఉదయం ఎండ్లూరు డొంక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాహుల్‌ను అదు పులోకి తీసుకుని విచా రించారు. అంతేగాక అత డిపై జిల్లాలోని అనేక పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదై ఉండడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయగా, పలు చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీం తో ఎస్‌ఐ రాజారావు నిందితుడి వద్ద నుంచి  2 సవర్ల నల్లపూసల దండ, ఎ మ్‌ఐ కంపెనీ సెల్‌ ఫోన్‌, రూ.3వేల నగదు, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.


అంతే గాక నిందితుడిని విచారణ చేయగా గతంలో సంతనూతలపాడులో సిండికేట్‌ బ్యాంకు పక్కన గల రెండతస్తుల భవనంలో దొంగతనానికి పాల్పడి నల్ల పూసల దండ, సెల్‌ఫోన్‌ను దొంగిలించినట్లు తెలి పాడు. అదే మండలంలోని కొనగానివారిపాలెంలోని మూ డు దేవాలయాల్లో హుండీలు దొంగిలించి రూ.9వేల నగదు అపహరించినట్లు డీఎస్పీ తెలిపారు. మంగ మూరులో మోటారుసైకిల్‌ దొంగిలించాడని చెప్పారు. 


నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుల్స్‌ శ్రీనివాసరావు, శ్యాంసన్‌ ప్రసాద్‌, కానిస్టేబుళ్లు అనిల్‌, నరేష్‌, శివల ను ఆయన అభినందించారు. సమావేశంలో రూరల్‌ సీఐ పి.సుబ్బారావు, సంత నూత లపాడు ఎస్‌ఐ దాసరి రాజారా వు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:08:09+05:30 IST