అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు
8 50 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం 8 విలేకరుల సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి
సోన్, జూన్ 22 : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ జల్సాలకు అల వాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన చిల్లర సురేష్, బత్తుల వెంకట్రావు, షేక్మస్తాన్అలీ అనే ముగ్గురు ముఠా సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణ జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలి పారు. ఇదే క్రమంలో మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఇంట్లో మంగళవారం దొంగతనానికి పాల్పడిన అనంతరం మండల కేంద్రానికి చెందిన అంపోలి మురళీధర్ ఇంట్లోతాళాలు పగల గొట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఇద్దరి ఇంట్లో 50 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగి లించారు. అంతకుముందు నిర్మల్ పట్టణంలోని నగేశ్వరవాడలో ఒక ద్విచక్ర వాహనం దొంగిలించారు. దొంగతనానికి పాల్పడిన 24 గంటల్లో పోలీసులు మండలంలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద చాకచక్యంగా పట్టుకున్నట్లు డీఎస్పీ వివ రించారు. పట్టుబడిన దొంగలు పలు కేసుల్లో జైలుశిక్షను అనుభవించి బయటకు వచ్చినట్లు తెలిపారు. తాగుడుకు, జల్సాలకు అలవాటు పడి దొంగ తనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తర లించినట్లు డీఎస్పీ వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్సై సంతోషం రవీందర్, పోలీసులు పాల్గొన్నారు.