‘ద్వంద్వ విధానాలు వీడాలి’

ABN , First Publish Date - 2022-05-29T06:00:16+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను వీడాలని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ జిల్లా శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు ఎన్‌జీవో హోమ్‌ వద్ద శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

‘ద్వంద్వ విధానాలు వీడాలి’
నిరసన తెలుపుతున్న ఎన్జీవో నేతలు

అరసవల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను వీడాలని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ జిల్లా శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు ఎన్‌జీవో హోమ్‌ వద్ద శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, దినసరి వేతన ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. నాయకులు చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-29T06:00:16+05:30 IST