70 దేశాల వారికి Dubai బంపరాఫర్.. కానీ భారత్‌కు మాత్రం..

ABN , First Publish Date - 2021-09-14T19:53:13+05:30 IST

మహమ్మారి కరోనావైరస్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ దేశాలు నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తున్నాయి.

70 దేశాల వారికి Dubai బంపరాఫర్.. కానీ భారత్‌కు మాత్రం..

దుబాయ్: మహమ్మారి కరోనావైరస్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ దేశాలు నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తున్నాయి. దీనిలో భాగంగా విదేశీ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాయి. వీటిలో గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈ, కువైత్ విదేశీ ప్రయాణికులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఆగస్టులో విజిట్ వీసాల జారీని ప్రారంభించిన యూఏఈ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న సుమారు 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ 70 దేశాలకు చెందిన ప్రయాణికులు దుబాయ్‌లో 'వీసా ఆన్ అరైవల్' పొందవచ్చు. 70 దేశాల వారు 90 రోజుల వ్యవధితో మల్టీపుల్ ఎంట్రీ విజిట్ వీసా పొందేందుకు అర్హులని దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ వెల్లడించింది. 


90 రోజుల మల్టీపుల్ ఎంట్రీ విజిట్ వీసా సౌకర్యం ఉన్న దేశాల జాబితా ఇదే..

Argentina, Austria, Bahamas Islands, Barbados, Belgium, Brazil, Bulgaria, Chile, Colombia, Costa Rica, Cyprus, Czech Republic, Denmark, El Salvador, Estonia, Finland, France, Germany, Greece, Honduras, Hungary, Iceland, Italy, Kiribati, Latvia, Liechtenstein, Lithuania, Luxembourg, Maldives, Malta, Montenegro, Nauru, Netherlands, Norway, Paraguay, Peru, Poland, Portugal, Romania, Russian Federation, Saint Vincent and the Grenadines, San Marino, Serbia, Seychelles, Slovakia, Slovenia, Solomon Islands, South Korea, Spain, Sweden, Switzerland, Uruguay


ఇవి కూడా చదవండి..

Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. కండిషన్స్ ఏంటంటే..


అలాగే ఇంకొన్ని దేశాలకు యూఏఈ 30 రోజుల వీసా సౌకర్యం కల్పించింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎలాంటి ముందస్తు వీసాల అవసరం లేకుండా యూఏఈని సందర్శించవచ్చు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరి పాస్‌పోర్టులపై ఈ 30 రోజుల విజిట్ వీసా‌ను స్టాంప్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సి అవసరం కూడా లేదు. ఇది పూర్తి ఉచితంగా లభిస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆ దేశాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే...

Andorra, Australia, Brunei, Canada, China, Hong Kong, China, Japan, Kazakhstan,  Macau, Malaysia, Mauritius, Monaco, New Zealand,  Republic of Ireland, San Marino, Singapore, Ukraine, United Kingdom and Northern Ireland, United States of America, Vatican City


ఇక భారత్ విషయానికి వస్తే.. 

భారత ప్రయాణికులకు కూడా యూఏఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించింది. కానీ, కేవలం 14 రోజుల వ్యవధితో మాత్రమే. సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన ప్రయాణికులు దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే యూఎస్ విజిట్ వీసా, గ్రీన్‌కార్డు లేదా యూకే, యూరోపియన్ యూనియన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా కలిగిన ప్రయాణికులకు ఆరు నెలల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నట్లు దుబాయ్ అధికారులు పేర్కొన్నారు.    



Updated Date - 2021-09-14T19:53:13+05:30 IST