Dubai వేదికగా అదరగొట్టిన ఇండియన్ టీచర్.. రెండేళ్ల కఠోర శ్రమతో వరల్డ్ రికార్డు సొంతం

ABN , First Publish Date - 2022-06-23T01:49:26+05:30 IST

దుబాయ్‌ వేదికగా ఇండియన్ యోగా టీచర్ అదరగొట్టాడు. ఏకంగా అర్ధగంటపాటు వృశ్చికాసనం వేసి.. గిన్నీస్ వరల్డ్ రికార్డు‌ను సొంతం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తు

Dubai వేదికగా అదరగొట్టిన ఇండియన్ టీచర్.. రెండేళ్ల కఠోర శ్రమతో వరల్డ్ రికార్డు సొంతం

ఎన్నారై డెస్క్: దుబాయ్‌ వేదికగా ఇండియన్ యోగా టీచర్ అదరగొట్టాడు. ఏకంగా అర్ధగంటపాటు వృశ్చికాసనం వేసి.. గిన్నీస్ వరల్డ్ రికార్డు‌ను సొంతం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 


ఇండియాకు చెందిన యష్ మన్సుఖ్ భాయ్ మొరాదియా‌కు ప్రస్తుతం 21ఏళ్లు. ఈ యువకుడు దుబాయ్‌లో యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. రెండేళ్లపాటు తీవ్రంగా శ్రమించి అరుదైన ఫీట్ సాధించారు. ఏకంగా 29 నిమిషాల 4 సెకన్లపాటు వృశ్చికాసనంలోనే ఉండి.. ఔరా అనిపించారు. అంతేకాకుండా ఆ భంగిమలో అత్యధిక సమయంపాటు ఉన్న వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇందుకు  సంబంధించిన వీడియోను జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఫీట్‌ను యష్.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అంటే 2/22/22తేదీన సాధించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడం పట్ల యష్ ఆనందం వ్యక్తం చేశారు. ఎమిదేళ్ల వయసు నుంచే యోగా చేయడం ప్రారంభించినట్టు చెప్పారు. వరల్డ్ రికార్డు కోసం కరోనా లాక్‌డౌన్ సమయంతో కలిపి సుమారు రెండేళ్లపాటు తీవ్రంగా సాధన చేసినట్లు పేర్కొన్నారు. 




Updated Date - 2022-06-23T01:49:26+05:30 IST