దుబాయ్ కోర్టు కీలక ఆదేశాలు.. 12 మంది భారతీయులను పొట్టనపెట్టకున్న వ్యక్తికి!

ABN , First Publish Date - 2021-02-26T06:23:23+05:30 IST

దుబాయిలోని కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్న బస్ డ్రైవర్ జైలు శిక్షను సంవత్సరానికి కుదించింది. వివరాల్లోకి వెళితే.. 2019 జూన్‌లో ఈద్ టూరిస్ట్‌ల

దుబాయ్ కోర్టు కీలక ఆదేశాలు.. 12 మంది భారతీయులను పొట్టనపెట్టకున్న వ్యక్తికి!

దుబాయి: దుబాయిలోని కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్న బస్ డ్రైవర్ జైలు శిక్షను సంవత్సరానికి కుదించింది. వివరాల్లోకి వెళితే.. 2019 జూన్‌లో ఈద్ టూరిస్ట్‌లతో మస్కట్ నుంచి దుబాయ్‌కి బయల్దేరిన బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైంది. నిషేధిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి బస్సు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది భారతీయులు ఉండగా.. ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వారు ఉన్నారు. ఐరిష్, ఒమన్, ఫిలిపినా దేశాలకు చెందిన ముగ్గురు పౌరులు కూడా ప్రమాదంలో మరణించారు. చాలా మంది గాయపడ్డారు.


ఈ క్రమంలో దుబాయ్ పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ఒమన్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ట్రాఫిక్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. అతనికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.9.8లక్షల ఫైన్‌ను విధించింది. అంతేకాకుండా అంతేకాకుండా రూ.6.7కోట్లను బాధిత కుటుంబ సభ్యులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కాగా.. సదరు బస్సు డ్రైవర్.. ట్రాఫిక్ కోర్టు ఆదేశాలను మరో కోర్టులో సవాల్ చేశాడు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు.. అతని జైలు శిక్షను ఏడేళ్ల నుంచి ఏడాదికి కుదిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - 2021-02-26T06:23:23+05:30 IST