Asia Cup 2022: దుబాయ్ పోలీసుల కీలక సూచన.. మ్యాచులకు వెళ్లే ప్రేక్షకులు వీటిపై ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2022-08-26T18:13:08+05:30 IST

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీ (Asia Cup Cricket Tournament) శనివారం నుంచి ప్రారంభం కానుంది.

Asia Cup 2022: దుబాయ్ పోలీసుల కీలక సూచన.. మ్యాచులకు వెళ్లే ప్రేక్షకులు వీటిపై ఓ లుక్కేయండి..

దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీ (Asia Cup Cricket Tournament) శనివారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 13 మ్యాచులు జరిగే ఈ టోర్నీలో 10 మ్యాచులు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే (Dubai International Cricket Stadium) జరగనున్నాయి. రేపటి ప్రారంభ మ్యాచ్ (శ్రీలంక వర్సెస్ ఆఫ్గనిస్థాన్) మొదలుకొని ఆదివారం జరిగే హైవొల్టేజీ మ్యాచ్ (పాక్ వర్సెస్ భారత్), సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్ మ్యాచ్ ఇలా 10 మ్యాచులు దుబాయ్ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ క్రికెట్ మైదానానికి వచ్చే ప్రేక్షకులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు తమతో పాటు ఏ వస్తువులు తీసుకురాకూడదో ఓ జాబితాను కూడా విడుదల చేశారు.  


ముఖ్య సూచనలు..

* మ్యాచ్‌కు మూడు గంటల ముందు మాత్రమే మైదానం గేట్లు తెరుస్తారు

* ప్రవేశానికి వాలిడ్ టికెట్ తప్పనిసరి

* రీ-ఎంట్రీకి అవకాశం లేదు

* నాలుగేళ్లకు పైబడిన పిల్లలకు టికెట్ తీసుకోవాలి

* పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేయాలి


ప్రేక్షకులు తమతో పాటు తీసుకెళ్లకూడని వస్తువులు/ గ్రౌండ్‌లో చేయకూడని పనులు..

* రిమోట్ కంట్రోల్ డివైజ్‌లు

* జంతువులు

* రేడియో కమ్యూనికేషన్ డివైజ్‌లు/ పవర్ బ్యాంక్స్

* సెల్ఫీ స్టిక్స్ లేదా గొడుగులు

* పదునైనా వస్తువులు

* బాణసంచాలు, పేలుడు పదర్థాలు

* లేజర్

* బయటి తినుబండారాలు, శీతలపానీయాలు

* రాజకీయ జెండాలు, బ్యానర్లు

* దూమపానం చేయకూడదు

* స్కేటింగ్ బోర్డులను అనుమతి లేదు

* వీడియో చిత్రీకరించడం, ఫొటోలు తీయడం చేయకూడదు

Updated Date - 2022-08-26T18:13:08+05:30 IST