ltrScrptTheme3

ఈ ఏడాది Diwali వేడుకలకు ప్రత్యేక హంగులతో ముస్తాబవుతున్న Dubai..!

Oct 24 2021 @ 08:36AM

దుబాయ్: దీపావళి అంటేనే దీపాల పండుగ. దీపాల వెలుగులో అట్టహాసంగా జరుపుకునే సంబురం. మన దగ్గరే కాదు దుబాయ్‌లో కూడా ఈ వేడుకల్ని ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఈ ఏడాది దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దుబాయ్ షాపింగ్ మాల్స్ బృందంగా ఏర్పడి గోల్డెన్ దివాళీ ఆఫర్లు తీసుకువస్తున్నాయి. 'సిటీ ఆఫ్ గోల్డ్ దివాళీ గ్లో' పేరిట నగలు కొనుగోలు చేసేవారికి ప్రత్యేక బహుమతులు అందించనున్నాయి. దీనిలో భాగంగా 1.50 లక్షల దిర్హామ్స్(రూ.30.62లక్షలు) విలువైన జ్యూయలరీ గిఫ్ట్ కార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే గోల్డెన్ దివాళీ సర్‌ప్రైజెస్ పేరుతో మరో లక్ష దిర్హామ్స్(రూ.20.41లక్షలు) విలువ చేసే గోల్డ్ గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంది. కేవలం 200 దిర్హమ్స్(రూ.4083) పెట్టి షాపింగ్ చేసిన వారికి డిజిటల్ రాఫెల్ కూపన్ ఇస్తారు. ఈ రాఫెల్ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు.

దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, గ్లోబల్ విలేజ్, ఫెస్టివ్ ప్లాజా, సిటీ సెంటర్ అల్ షిందగా, సిటీ సెంటర్ దీరా, ఎక్స్ పో 2020 ఇలా చాలా వ్యాపార సముదాయాలు ఈ 'సిటీ ఆఫ్ గోల్డ్ దివాళీ గ్లో'‌లో పాల్గొంటున్నాయి. ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ అఛీవర్స్ నైట్, మోట్టా మాది మ్యూజిక్ సింగ్ కన్సర్ట్, దుబాయ్ డిజైనర్స్ వీక్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు సైతం ఉన్నాయి. వీటికితోడు జుమైరహా బీచులో నిర్వహించే ఫైర్‌వర్క్స్ షోలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. నవంబర్ 4న(గురువారం) రాత్రి 8.30 గంటలకు బ్లూవాటర్స్ ఫైర్‌వర్క్స్ ఈ ప్రత్యేక షోను ఏర్పాటు చేసింది. ఇలా ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలతో దుబాయ్ నగరం దీపావళి పండుగను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి స్థానికులతో పాటు మనోళ్లకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు కనులవిందును కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.