ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేయలేను.. రాజీనామా చేస్తున్నా: అనితా దీప్తి

ABN , First Publish Date - 2021-11-22T00:10:28+05:30 IST

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో..

ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేయలేను.. రాజీనామా చేస్తున్నా: అనితా దీప్తి

కడప: చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి అనే మహిళా ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అనితా దీప్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైల్వే కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం నిర్వహించలేనని, ఇప్పటికే అనేక ఒత్తిళ్లకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు అనితా దీప్తి వివరించారు. 


Updated Date - 2021-11-22T00:10:28+05:30 IST