Advertisement

ఎన్నికల ఎఫెక్ట్‌.. సినిమాలు వాయిదా?

Mar 2 2021 @ 10:38AM

కోలీవుడ్: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా స్తంభించిపోయిన చిత్రపరిశ్రమ అన్‌లాక్‌లో భాగంగా ఆంక్షల సడలింపుతో క్రమంగా పుంజుకుంటోంది. స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఇళయదళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం, హీరో శిలంబరసన్‌ నటించిన ‘ఈశ్వరన్‌’, విశాల్‌ నటించిన ‘చక్ర’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతలోనే రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి నెలాఖరులో శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’, ఏప్రిల్‌ నెలలో ధనుష్‌ నటించిన ‘కర్ణన్‌’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఇందుకోసం విడుదల తేదీలను కూడా వెల్లడించారు. అయితే,  ఎన్నికల కారణంగా మార్చి 26వ తేదీన విడుదల కావాల్సిన ‘డాక్టర్‌’, ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సిన ’కర్ణన్‌’ చిత్రాల విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.