విమానం ల్యాండ్ అవగానే కిందకు దిగి చూసిన ఓ ప్రయాణికుడికి మైండ్‌బ్లాక్.. తాను చేసిన తప్పేంటో గ్రహించి..

ABN , First Publish Date - 2022-06-13T22:17:47+05:30 IST

అతను హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్ కొన్నాడు.. సమయానికి విమానాశ్రయానికి చేరుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు..

విమానం ల్యాండ్ అవగానే కిందకు దిగి చూసిన ఓ ప్రయాణికుడికి మైండ్‌బ్లాక్.. తాను చేసిన తప్పేంటో గ్రహించి..

అతను హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్ కొన్నాడు.. సమయానికి విమానాశ్రయానికి చేరుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు.. బస్సులో విమానం వరకు వెళ్లాడు.. అక్కడ సిబ్బంది అతడి టికెట్ తనిఖీ చేసి విమానం ఎక్కించారు.. విమానం ల్యాండ్ అవగానే కిందకు దిగి చూసిన ప్రయాణికుడికి మైండ్ బ్లాక్ అయ్యింది.. ఎందుకంటే అతడు దిగింది రాయ్‌పూర్‌లో కాదు.. జబల్పూర్‌లో. దీంతో అతను షాకయ్యాడు. 


ఇది కూడా చదవండి..

62 ఏళ్ల వయసులో పెళ్లి సిద్ధమైన వృద్ధుడికి భారీ షాక్.. ఏకంగా రూ.60 లక్షల నష్టం.. ఎలా పోగొట్టుకున్నాడో తెలిస్తే..


రాయ్‌పూర్‌‌కు చెందిన వినయ్‌ గోపాలన్‌ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్‌ బుక్ చేసుకున్నాడు. సమయానికి హైదరాబాద్ విమానాశ్రయం లోపలికి చేరుకున్నాడు. సిబ్బంది టికెట్ తనిఖీ చేసి లోపలికి పంపారు. ఆ తర్వాత బస్సులో ఫ్లైట్‌ వరకు తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ వినయ్ టికెట్ చెక్ చేసి ఫ్లైట్‌లోకి అనుమతించారు. అయితే ఆయన కూర్చున్న విమానం రాయ్‌పూర్‌కు కాకుండా.. జబల్‌పూర్‌కు వెళుతోంది. 


నిజానికి మధ్యలోనే అతనికి అనుమానం వచ్చింది. ఎందుకంటే అతను కూర్చున్న 7-ఏ సీటు టికెట్ మరో ప్రయాణికురాలికి కూడా వచ్చింది. అయితే సిబ్బంది ఆమెను మరో సీటులో కూర్చోపెట్టారు. వినయ్ విమానం దిగి చూస్తే తను జబల్పూర్ చేరుకున్నట్టు తెలిసింది. దీంతో అతను ఇండిగో విమాన యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. చాలా చోట్ల తనిఖీలు జరిగినప్పటికీ ఎవరూ తన గమ్యస్థానం గురించి పట్టించుకోలేదని అతను పేర్కొన్నాడు. 

Updated Date - 2022-06-13T22:17:47+05:30 IST