ధ్రువీక‘రణం’.. రోజుకో మలుపు తిరుగుతున్న దుగ్గిరాల వ్యవహారం

ABN , First Publish Date - 2021-10-19T05:34:32+05:30 IST

జబీనా కుల ధ్రువీకరణపై ముగ్గురు అధికారులు విచారణ జరిపారు. విచారణ ఒక తంతుగా ముగించారనే ఆరోపణలున్నాయి.

ధ్రువీక‘రణం’.. రోజుకో మలుపు తిరుగుతున్న దుగ్గిరాల వ్యవహారం

అడ్డదిడ్డమైన మెలికలతో తిరస్కరణ

ధ్రువీకరణపత్రంపై అడ్డగోలు విచారణ

జబీనా కుల ధ్రువీకరణలో వీడని మొండిపట్టు

మూడు సార్లు.. నాలుగు గోడల మధ్యే విచారణ

తహసీల్దారు నివేదికనే కలెక్టర్‌ సమర్థించటంపై ఆగ్రహం

విచారణ తీరుపై మండిపడుతున్న టీడీపీ నాయకులు, మైనారిటీ సంఘాలు

అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి ఆరోపణ

రోజుకో మలుపు తిరుగుతున్న దుగ్గిరాల వ్యవహారం


దుగ్గిరాలలో ధ్రువీకరణ రణం కొనసాగుతూ ఉంది.  రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. తాజాగా కలెక్టర్‌ కూడా ఎంపీపీ టీడీపీ అభ్యర్థి జబీనా బీసీ-ఈ కుల ధ్రువీకరణను తిరస్కరించారు. దీంతో మైనార్టీ సంఘాలతో పాటు టీడీపీ నాయకులు, బాధిత కుటుంబసభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వైసీపీకి మెజార్టీ లేదు.. అయినా ఎంపీపీ పదవి వదలకూడదు. టీడీపీ అభ్యర్థికి పదవి దక్కనీయకుండా చేయాలి. అనే ధోరణిలో అధికార పార్టీ ఉండగా.. అందుకు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని.. హైకోర్టు ఆదేశించినా మొండిగా ముందుకే వెళ్తున్నారని.. టీడీపీ నాయకులు, మైనార్టీ సంఘాలు, బాధితురాలు వాపోతున్నారు.  తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, అధికారులు కేవలం రాజకీయ అజెండాతోనే ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని, దీనిపై న్యాయ విచారణకు వెళతామని కోర్టును కోరతామని బాధితులు చెబుతున్నారు. వారంలో తేలిపోతుందనుకున్న వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ మళ్లీ న్యాయస్థానం చెంతకే చేరే పరిస్థితి రావటం చర్చనీయాంశమే. 



తెనాలి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జబీనా కుల ధ్రువీకరణపై ముగ్గురు అధికారులు విచారణ జరిపారు. విచారణ ఒక తంతుగా ముగించారనే ఆరోపణలున్నాయి. అర్హతలున్నా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డగోలుగా వ్యవహరించారని, ఏ అధికారి తీరుపై బాధితులు కోర్టును ఆశ్రయించారో ఆ అధికా రి నివేదికనే కలెక్టరూ సమర్ధించారని, దీని ని బట్టి అంతా ఒక పథకం ప్రకారం సా గుతున్నట్లు బాధితులు ఆరోపించా రు.  జబీనా విషయంలో అర్హత కానిది మరొకరి విషయంలో ఎలా అవుతుందో తేల్చాలని మైనారిటీ సంఘాల డిమాండ్‌ చేస్తున్నాయి. షేక్‌ జబీనాకు ఎంపీపీ అయ్యే అవకాశం దక్కనీయకుండా కుల ధ్రువీకరణ ఇచ్చే విషయంలో అధికార పార్టీ ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్నారు. జబీనా హైకోర్టును ఆశ్రయించటంతో ఎన్నిక ఆగిపోయింది. ధ్రువీకరణ వ్యవహారాన్ని విచారిం చి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌పై బాధ్యత పెడుతూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై బాధితురాలు ఆరోపించిన అధికారి ఎవరున్నారో అదే అధికారి విచారణ జరపటం చర్చకు కారణమైంది. కుల ధ్రువీకర ణ వ్యవహారం తెరపైకి రాక ముందే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు పూర్తి మెజారిటీ లేదని తెలిసి కూడా బహిరంగంగానే దుగ్గిరాల పీఠం తమదేనని ప్రస్థావించారని వీటిని న్యాయస్థానం ముందుంచుతామని బాధితులు చెబుతున్నారు. 


న్యాయ నిపుణుల బృందంతో విచారించాలి..

హైకోర్టు ఆదేశాలిచ్చినా తిరస్కరణకు ప్రాధాన్యం ఇచ్చి న తహసీల్దారుతోనే విచారణ జరిపించటం, ఆమె ఇచ్చిన నివేదికనే కలెక్టర్‌ కూడా సమర్థించటం చూస్తే ఇందులో కుట్ర ఉందని బాధితులతో పాటు టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర శాఖల అధికారులతో తమకు న్యాయం జరగదనేది బాఽధితుల ఆవేదన. అందుకే తిరిగి హైకోర్టును ఆశ్రయించదలిచామని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారుల బృందంతోకానీ, న్యాయ నిపుణులతో కూడిన బృందంతోకానీ విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందనేది జబీనా కుటుంబీకుల అభిప్రా యం. తహసీల్దారు నేరుగా విచారించటం ఒక ఆక్షేపణ అయితే, ఆమె ముందు తేదీతో ఉన్న నోటీసును తర్వాతి రోజు, అది కూడా విచారణ సమయానికి కేవలం రెండు గంటల ముందు ఇంటిపై నోటీసు అంటించి వెళ్లటం పైనా వారు ఆక్షేపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము న్యాయస్థానాన్నే నమ్ముకున్నామని వారు అంటున్నారు. 


సమాధానాలు లేని సందేహాలు

  మహమ్మద్‌, షేక్‌లకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన దుగ్గిరాల తహసీల్దారు జబీనా విషయంలోనే ఎందుకు పట్టుబడుతున్నారు? అర్హత లేదనే మడతపేచీ ఎందుకు పెడుతున్నారు? చివరకు కోర్టు ఉత్తర్వులు వచ్చాక కూడా ఎందుకు తొండాటకు దిగుతున్నారని రెవెన్యూశాఖలోని విశ్రాంత ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

  - నిజంగానే జబీనా విషయంలో తండ్రి ఇంటిపేరు మహమ్మద్‌ అయితే, భర్త ఇంటిపేరు షేక్‌. అయితే షేక్‌లను బీసీల్లో చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిస్తే, మహమ్మద్‌ల విషయంలో గతం నుంచి బీసీ-ఈ కులం కిందే ధ్రువపత్రాలను అందిస్తున్నారు. ఇదే మండల కార్యాల యం నుంచి 2012లో మహమ్మద్‌ ఖాసిం అనే వ్యక్తికి అప్పటి తహసీల్దారు ఎం.శిరీష, 2015లో అప్పటి తహసీల్దారు పి.సిహెచ్‌.వెంకయ్య చిలువూరు గ్రామానికే చెంది న మహమ్మద్‌ సలాఉద్దీన్‌కు, 2017లో ఇదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ అఫ్జలుద్దీన్‌కు ఎం.స్వర్ణలతమ్మ అనే తహసీల్దారు బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్టు జబీనా అధికారులకు ఆధారాలు ఇచ్చారు. వాటిలో మహమ్మద్‌ బి.సి-ఈ కిందికి ఎలా వస్తారనేది కూడా చూపా రు. జీవో 1793, ఎడ్యుకేషన్‌, డేట్‌: 23-09-1970 సవరణకు 07-07-2007 తేదీతో ఉప సవరణ జీవో 23, బి.సి.డబ్ల్యు(సి2) ప్రకారం మహమ్మద్‌లు బీసీ-ఈ కిందికి వస్తారనేది ఇందులోని సారాంశం. అటువంటప్పుడు జబీనాకు కుల ధ్రువీకరణ పత్రం బీసీ-ఈ కింద ఎందుకు ఇవ్వరనేది అందరి ప్రశ్న.  

-  జబీనాకు కలెక్టర్‌ పంపిన 38 పేజీల తిరస్కరణ సా రాంశంలో తహసీల్దారు చూపిన పాత అంశాలనే చూపటం విశేషం. ఆమె జతచేసిన టీసీలో 5వ కాలం ఖాళీగా ఉందనేది ఒక పెద్ద కారణంగా బూతద్దంలో చూపుతున్నారు. అయితే టీసీ ఒక్కటే ప్రామాణికం కాదని, ప్రత్య క్ష, క్షేత్ర స్థాయి విచారణ కీలకమనే విషయాన్ని వారే గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్నా, జబీనా విషయం లో మాత్రం పెద్ద లోపంగా చూపటం విశేషం. 

  - తాను మహమ్మద్‌ కులానికి చెందిన వ్యక్తినని చెబుతూనే షేక్‌ పేరుతో జబీనా కుల ధ్రువీకరణ పత్రం కోరుతున్నారని ప్రస్తావించారు. ఇటువంటి గందరగోళ పరిస్థితే ఉంటే, అధికారులు క్షేత్ర స్థాయి విచారణతో ఒక నిర్ధారణకు రావాలి. భర్త కులం మహిళకు రాదని, తండ్రి కులం వస్తుందని కూడా ప్రస్థావించారు. భర్త కులం షేక్‌ అనేది బీసీ-ఈ జాబితాలోనిదే. పోనీ ఇది వర్తించదనుకుంటే, మహమ్మద్‌లు కూడా బీసీ-ఈ కిందికే వస్తారంటూ 2012లోనే బీసీ సంక్షేమశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల ధ్రువీకరణ వ్యవహారంలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఆర్‌.సి.నంబర్‌ ఈ/1261/2012, డేట్‌ 06-07-2012తో సర్క్యులర్‌ జారీ చేశారు. యాక్ట్‌ 16, 1993లో పొందుపరిచిన జీవో 58 ప్రకారం కుల ధ్రువీకరణ నిర్ధారణకు ఒక నిర్ధిష్ట విధానాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం ఒక వ్యక్తి పేరుకు ముందు, వెనుక ఉండే ఇంటిపేర్లను ఆధారంగా చేసుకుని కులాన్ని నిర్ణయించరాదని, క్షేత్రస్థాయి విచారణ ద్వారానే నిర్ణయించాలని 1997లో ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే జబీనా విషయంలో ఫీల్డ్‌ ఎంక్వయిరీ లేకుండానే ఇంటిపేర్లు, టీసీ ఆధారంగా కుల ధ్రువీకరణను తేల్చేయ టం విశేషం. మహమ్మద్‌లు, షేక్‌లు ఒకేటేనన్న ఆధారా లు చూపలేదని ప్రస్థావించారు. అయితే ఇక్కడ తం డ్రి కులం మాత్రమే ఆమెకు వర్తిస్తుందనుకున్నప్పుడు దీనికి ఆధారాలు చూపాల్సిన అసవరం కూడా లేదు. తండ్రికి కూడా కుల ధ్రువీకరణ పత్రం లేదని పేర్కొన్నారు.  

- తాము కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవలసిన అవసరం రాలేదని, అయితే తమ తండ్రి తరపు అన్నదమ్ములు, వారి పిల్లలకు బీసీ-ఈ కుల ధ్రువీకరణ పత్రాన్ని అందించారనే విషయాన్ని విచారణ సమయంలో తహసీల్దారు, సబ్‌కలెక్టర్‌, కలెక్టర్‌ ముందు మొత్తుకున్నా పట్టించుకోలేదని జబీనా తెలిపారు. మహమ్మద్‌లకు బీసీ-ఈ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వరాదనే నిబంధనలు ఉంటే, గత దశాబ్ద కాలంలోనే వందల సర్టిఫికెట్‌లు ఒక్క దుగ్గిరాల తహసీల్దారు కార్యాలయం నుంచే మంజూరు చేశారని, వాటిని నిబంధనల కు విరుద్ధంగా ఎలా మంజూరు చేస్తారని బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జబీనా విషయంలో ఇది న్యాయం అనిపిస్తే, మిగిలినవారి విషయంలో తప్పుదారిలో మంజూరు చేసిన తహసీల్దారులందరిపై కలెక్టర్‌ ఎందుకు చర్యలకు ఆదేశాలు జారీచేయలేదంటున్నారు.

- 1997లోనే వీటిపై స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఫీల్డ్‌ ఎంక్వయిరీ తప్పనిసరని చెప్పినా నేడు జబీనా విషయంలో కింది స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు క్షేత్రస్థాయి విచారణకు ఎందుకు వెళ్లలేదనేది వారి ఆక్షేపణ. అయితే కలెక్టర్‌ సైతం జబీనా విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారనే పద్ధతిలో సాకులు చూపుతున్నారని టీడీపీ నాయకుల వాదన. 

Updated Date - 2021-10-19T05:34:32+05:30 IST