ధూళిపాళ్ల అరెస్టు అన్యాయం

ABN , First Publish Date - 2021-04-24T04:52:33+05:30 IST

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు అక్రమమని, దీన్ని ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ధూళిపాళ్ల అరెస్టు అన్యాయం
మాట్లాడుతున్న అమీర్‌బాబు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు అక్రమమని, దీన్ని ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. సంఘం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు నరేంద్ర కుటుంబం అండగా నిలిచిందని, ఆయన అరెస్టును ప్రజలు హర్షించరన్నారు. జగన్‌ ప్రభుత్వం కేవలం టీడీపీ నాయకులను టార్గెట్‌ చేయడం నీచమైన చర్య అని, దీంతో ప్రతిపక్షం గొంతు ఆపలేరన్నారు. 


రాష్ట్రానికి చేసిందేమీ లేదు : టీడీపీ

జగన్‌ ప్రభుత్వం ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయ డం దారుణమని, అరె స్టులు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని కడప నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కో ఆపరేటివ్‌ కాలనీలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షన్‌ భావజాలం ఉన్న వ్యక్తి సీఎం అయితే పాలన ఇలాగే ఉంటుందని విమర్శించారు. నరేంద్ర ఏం తప్పు చేశారని అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఽధూళిపాళ్లను విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి మాసా కోదండరామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:52:33+05:30 IST